TS News: రాష్ట్రంలో కొనసాగుతోన్న ఐపీఎస్ ల బదిలీలు..తాజాగా మరో ముగ్గురు బదిలీ.!

తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ముగ్గురు ఐపీఎస్ అఫీసర్లు బదిలీ అయ్యారు. మల్టీజోన్ 1 ఐజీగా రంగనాథ్, టీఎస్ న్యాబ్ ఎస్పీగా శరత్ చంద్ర పవార్, ఆర్గనైజేషన్స్ ఐజీగా విశ్వప్రసాద్ ను నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

IPS Transfers: తెలంగాణలో నలుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ
New Update

TS News:  తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ముగ్గురు ఐపీఎస్ అఫీసర్లను బదిలీ చేసింది సర్కార్. మల్టీజోన్ 1 ఐజీగా రంగనాథ్, టీఎస్ న్యాబ్ ఎస్పీగా శరత్ చంద్ర పవార్, ఆర్గనైజేషన్స్ ఐజీగా విశ్వప్రసాద్ ను నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

publive-image

అంతకు ముందు పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి (CS Santhi Kumari) ఉత్తర్వులు జారీ చేశారు. 

* సిద్దిపేట (Siddipet) జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ
* సిద్ధిపేట నూతన కలెక్టర్ గా కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరిని (Mikkilineni Manu Choudary) నియమించింది.
* వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్‌ బాషాను జనగాం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది.
* అలాగే వరంగల్ (Warangal) జిల్లా కలెక్టర్ శివలింగయ్యను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది.
* ప్రస్తుత పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శైలజా రామయ్యర్‌కు రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను అదనంగా అప్పగించింది. ఇంతకాలం ఆ బాధ్యతలు (అదనపు హోదాలో) చూస్తున్న సునీల్ శర్మను అక్కడి నుంచి రిలీవ్ చేసింది రాష్ట్ర సర్కార్.

ఇది కూడా చదవండి: కేవలం రూ. 10తో మీ కూతురు బంగారు భవిష్యత్‎కు బాట…స్కీం పూర్తి వివరాలివే..!

#ips-transfers #ips-ranganath #ips-sharath-chandra-pawar #police-department
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe