ప్రముఖ చైనీస్ టెక్ కంపెనీ వన్ ప్లస్... ఈ నెల ప్రారంభంలో తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus Nord CE 3 5Gని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్లను అందించింది. లాంచ్ అయిన తర్వాత కూడా ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాలను హోల్డ్ లో పెట్టింది కంపెనీ. లాంచ్ సమయంలో కంపెనీ దాని విక్రయ తేదీని వెల్లడించలేదు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయం ఆగస్టు నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. ఇప్పుడు దాని విక్రయ తేదీకి సంబంధించి కొత్త లీక్ రిపోర్ట్ తెలిసింది. లీక్ లను బట్టి చూస్తుంటే ఆగస్టు మొదటి వారం నుంచి OnePlus Nord CE 3 5G మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.
OnePlus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్ త్వరలో భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉంటుందని ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ఒక పోస్ట్‌లో వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ సేల్ తేదీ మాత్రమే కాకుండా, స్మార్ట్‌ఫోన్‌పై అందుబాటులో ఉన్న బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌ను కూడా టిప్‌స్టర్ వెల్లడించింది. OnePlus ఈ లేటెస్ట్ డివైజ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
OnePlus Nord CE 3 5G అనేది OnePlus నుంచి వస్తున్న మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్. ఆగస్టు మొదటివారంలో మార్కెట్లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అయితే వినియోగదారులు నేరుగా ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ వెల్లడించిన ప్రకారం ఇది ఆగస్టు 5 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. అంతేకాదు...ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై కస్టమర్‌లకు రూ. 2000 వరకు తగ్గింపు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది.
ఈ కొత్త నివేదిక ప్రకారం, OnePlus Nord CE 3 5G అత్యంత ప్రాథమిక మోడల్‌ను రూ. 24,999గా ఉండే ఛాన్స్ ఉంది. బేస్ మోడల్ 8GB RAM, 128GB స్టోరేజీతో అందుబాటులో ఉంటుంది. అయితే దీని టాప్ వేరియంట్ 12GB RAM, 256 స్టోరేజ్‌తో వస్తుంది. మీరు రూ. 26,999కి బ్యాంక్ ఆఫర్‌తో టాప్ వేరియంట్‌ని పొందవచ్చు. OnePlus OnePlus Nord CE 3 5Gని ఆక్వా సర్జ్, గ్రే షిమ్మర్ అనే రెండు రంగులలో విడుదల చేసింది.