నోబెల్ ప్రైజ్(Nobel Prize) గెలుచుకోవడం చాలా మంది సైంటిస్టుల కల. అనేక రంగాల్లో సైంటిస్టులకు నోబెల్ ప్రైజ్ ఇస్తారు. అయితే సైన్స్‌కి మూలలున్న మ్యాథ్స్ ఫీల్డ్‌కి మాత్రం ఈ ప్రైజ్ ఇవ్వరు. దీనిపై అనేక రకాల థీయరీలు ఉండగా.. అందులో నోబెల్‌తో సోఫియా లవ్ స్టోరీ గురించే ఎక్కువగా చర్చించుకుంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ చాలా మంది మాత్రం దీన్నే నమ్ముతారు.
మ్యాథ్స్ లేదు:
1895లో నోబెల్ బహుమతులను స్థాపించిన ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామాలో, బహుమతులు ఇవ్వవలసిన రంగాలను ఇలా రాశారు: భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఫిసియోలజీ లేదా వైద్యం, సాహిత్యం, శాంతి. ఈ జాబితాలో గణితం లేదు. నోబెల్ గణితాన్ని ఎందుకు మినహాయించారనే దానిపై కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. స్వీడిష్ గణిత శాస్త్రజ్ఞుడు గోస్టా మిట్టాగ్-లెఫ్లర్‌తో శత్రుత్వం కారణంగా నోబెల్ గణితంపై వ్యక్తిగత పక్షపాతాన్ని చూపించారన్న ప్రచారం ఉంది. మరొక ప్రచారం ప్రకారం నోబెల్ గణితశాస్త్రాన్ని థీయరీగానే భావించాడట. అంటే ప్రాక్టీకల్‌గా యూజ్ అవ్వని అనేక సిద్ధాంతాలను మ్యాథ్స్ మోస్తుందన్నది ఆయన భావనగా చెబుతుంటారు. అయితే మ్యాథ్స్‌పై సరైన అవగాహన లేకనే నోబెల్ ఇలా ఆలోచించారని గణిత సైంటిస్టులు అభిప్రాయపడుతుంటారు.
లవ్ స్టోరీ సంగతేంటి?
నోబెల్‌కి సోఫియా అంటే చాలా ఇష్టమన్న ప్రచారం ఉంది. ఆమె మ్యాథ్స్‌లో అనేక ఘనతలు సాధించిన మహిళ. సోఫియా ఎదుగుదలకు నోబెల్ కారణమని చెబుతుంటారు. సోఫియాకు ఎన్నో విధాలుగా నోబెల్ సాయం చేశాడని అంటుంటారు. 19వ శతాబ్దంలో మహిళలకు చదువు అనవసరం అనే భావన ఉన్న రోజుల్లో సోఫియా మ్యాథ్స్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ఎంతో కష్టపడింది. ఆమె వెనుక నోబెలే ఉన్నారని పలువురు చరిత్రకారులు చెబుతుంటారు. రష్యా సైంటిఫిక్ సర్కిల్స్‌లో సోఫియా అంటే తెలియనవారు ఉండరు. యూరప్ వ్యాప్తంగా గణితంలో డాక్టరేట్ సంపాదించిన మొదటి మహిళ సోఫియా. ఆల్‌ఫ్రెడ్ నోబెల్- సోఫియా మధ్య రొమాంటిక్ లవ్ స్టోరీ ఉందో లేదో ఎవరికి సరిగ్గా క్లారిటీ లేదు. ఆయన సాయం చేశాడని మాత్రమే తెలుసు. అయితే స్వీడిష్ గణిత శాస్త్రజ్ఞుడు గోస్టా మిట్టాగ్‌తో సోఫియాకు రిలేషన్ ఉందన్న టాక్ ఉంది. అతనో గొప్ప సైంటిస్ట్. నోబెల్ ప్రైజ్ ఒకవేళ మ్యాథ్స్ ఫీల్డ్‌వాళ్లకి ఇవ్వాల్సి వస్తే గోస్టాకు ఇవ్వాల్సి వస్తుందేమోనని నోబెల్ భావించాడని.. అందుకే ఆ ఫీల్డ్‌ని ప్రైజ్ జాబితాలో చేర్చాలేదని అంటుంటారు. అయితే ఈ స్టోరీని చాలా మంది తోసిపుచ్చుతున్నారు. సాక్ష్యాధారాలు కూడా లేవు. మ్యాథ్స్ ఫీల్డ్ వాళ్లకి ప్రైజ్ ఇవ్వరు కానీ.. గణిత శాస్త్రజ్ఞులకు ఇతర ఫీల్డ్‌లో రాణిస్తే ఇస్తుంటారు.
ALSO READ: జగన్‌పై ఉన్న కేసులు ఎత్తివేస్తారా? పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!