AP Free Bus : ఏపీలో ఫ్రీ బస్ పై మాట మార్చిన మంత్రి.. ఆ పోస్ట్ డిలీట్ చేయడంపై దుమారం!

ఏపీలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ఏపీ ప్రభుత్వం వివరించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ట్విటర్లో పేర్కొన్నారు.అయితే ఆయన ట్విట్‌ ని కొద్దిసేపటికే డిలీట్‌ చేశారు.

AP Free Bus : ఏపీలో ఫ్రీ బస్ పై మాట మార్చిన మంత్రి.. ఆ పోస్ట్ డిలీట్ చేయడంపై దుమారం!
New Update

AP Free Bus Scheme : ఏపీ మహిళలకు కూటమి ప్రభుత్వం (Alliance Government) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఉచిత బస్సు (Free Bus) ప్రయాణానికి ముహుర్తాన్ని ఖరారు చేసింది. ఏపీ (Andhra Pradesh) లోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు వివరించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ట్విటర్లో పేర్కొన్నారు.

అయితే ఆయన ట్విట్‌ ని కొద్దిసేపటికే డిలీట్‌ చేశారు. ఓ పక్క ఏపీ కేబినెట్‌ సమావేశం జరుగుతుండగా..ఈ విషయం గురించి ఎలాంటి చర్చ జరగకుండానే ఉచిత బస్సు గురించి మంత్రి ప్రకటించిడంతో తీవ్ర చర్చ జరిగినట్లు సమాచారం. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌శాఖ మంత్రిగా ఉండి.. రవాణాశాఖకు సంబంధించిన కీలక అంశం గురించి అధిష్టానం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకముందే..ట్విటర్‌ (X) లో పోస్ట్‌ పెట్టడం, అది చర్చకు దారి తీయడంతో వెంటనే ఆయన పోస్టు డిలీట్‌ చేశారు.

Also read: ప్రారంభమైన ఏపీ క్యాబినెట్ భేటీ.. ఆ చట్టం రద్దుకు ఆమోదం!

#pawan-kalyan #chandrababu-naidu #ap-free-bus-scheme #ap-cabinet-meet
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe