Accident: లారీ బీభత్సం..బైక్ ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది..!

హైదరాబాద్ లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. బైక్ ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. అయితే, బైక్ నడిపే వ్యక్తికి తృటిలో ప్రమాదం తప్పింది. బైక్ పై వ్యక్తి లారీ డోర్ పట్టుకొని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశాడు. అయినా, లారీ డ్రైవర్ ఆపకుండా కొన్ని కిలో మీటర్లు దూరం లారీని అలాగే తీసుకెళ్లాడు.

New Update
Accident: లారీ బీభత్సం..బైక్ ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది..!

Hyderabad Accident:హైదరాబాద్ లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఒవైసీ హాస్పిటల్ నుంచి ఎల్బీ నగర్ మార్గంలో వెళ్తున్న లారీ ఐఎస్ సదన్ పరిధిలో రాత్రి బైక్ ను వేగంగా వచ్చి ఢీ కొట్టింది. అయితే, లారీ డ్రైవర్ ఏ మాత్రం ఆపకుండా లారీని పోనివ్వడంతో.. బైక్ ను సైతం కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. వెంటనే అలర్ట్ అయిన బైక్ డ్రైవర్ లారీ డోర్ పట్టుకొని ప్రాణాలు దక్కించుకున్నాడు. అయితే, ఈ సంఘటనను లారీ వెనకున్న వ్యక్తులు వీడియోను తీసి సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రవికుమార్ అనే వ్యక్తి ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ ఈ విధంగా స్పందించాడు. డియర్ సర్.. ఈ ఆక్సిడెంట్ సంఘటన చూడండి.. ఇది ఒవైసీ హాస్పిటల్ నుంచి LB నగర్ నుంచి హయత్ నగర్ రూట్ వరకు జరిగింది. దయచేసి ఈ మార్గంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేయండి అంటూ కామెంట్ చేశాడు. ఈ ట్వీట్ కు హైదరాబాద్ సిటీ పోలీస్ వెంటనే స్పందించారు. మేము పరిశీలిస్తామని పేర్కొంది.

Also Read: 30 ఏళ్లు దాటాక డేటింగ్‌లో ఈ తప్పులు అస్సలు చేయకండి

Advertisment
తాజా కథనాలు