బీఆర్ఎస్ నేతలు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి.రక్తాలు కారేలా తన్నుకున్నారు. ఈ దాడిలో ఒకరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఈ ఘటన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తలపెట్టిన గోషామహల్ రోడ్ షోలో చోటుచేసుకుంది.
గోషామహల్ లో బీఆర్ఎస్ రోడ్ షో నిర్వహించింది. ఈ రోడ్ షో మంత్రి కేటీఆర్ పాల్గొన్ని ప్రసంగిస్తుండగానే ఘర్షణ షురూ అయ్యింది. ఈ ఘర్షణకు ప్రధానంగా ఉద్యమకారుడు దిలీప్ ఘనాటే, మాజీ కార్పొరేటర్ రామచందర్ రాజుల మధ్య చోటుచేసుకుంది. పార్టీ సమావేశాల గురించి తనకు సమాచారం ఇవ్వలేదని దిలీప్ ఘనాటే ప్రశ్నించారు. దీంతో రామచందర్ రాజు చిరాకు పడ్డాడు. తననే ప్రశ్నిస్తాడా అంటూ ఫైర్ అయ్యాడు. దిలీప్ పై భౌతిక దాడికి దిగాడు. దీంతో దిలీప్ కు తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆయన అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. అక్కడున్న కార్యకర్తలు దిలీప్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.