అధికార పార్టీ లీడర్ పై కరెంటోళ్ల ప్రేమకు.. అన్నదాత బలి!

అధికార పార్టీ కండువా మెడలో ఉంటే చాలు..అన్నీ అనుకూలంగా మారిపోతుంటాయి. అధికారులు రూల్స్ కూడా పక్కన పెట్టి అయ్యగారి సేవలో ఉంటారు. దీంతో సామాన్యులకు ఇబ్బందులు ఎదురైనా పర్వాలేదన్నట్టుగా వ్యవహారం ఉంటుంది. దీంతో పాపం ఓ అన్నదాత అధికార పార్టీ నేతలు, అధికారులు ఒక్కటై పోవడం వల్ల తనకు జరిగిన అన్యాయానికి ఆరునెలలుగా కాళ్ళ చెప్పులు అరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.

అధికార పార్టీ లీడర్ పై కరెంటోళ్ల ప్రేమకు.. అన్నదాత బలి!
New Update

అధికార పార్టీ కండువా మెడలో ఉంటే చాలు..అన్నీ అనుకూలంగా మారిపోతుంటాయి. అధికారులు రూల్స్ కూడా పక్కన పెట్టి అయ్యగారి సేవలో ఉంటారు. దీంతో సామాన్యులకు ఇబ్బందులు ఎదురైనా పర్వాలేదన్నట్టుగా వ్యవహారం ఉంటుంది. దీంతో పాపం ఓ అన్నదాత అధికార పార్టీ నేతలు, అధికారులు ఒక్కటై పోవడం వల్ల తనకు జరిగిన అన్యాయానికి ఆరునెలలుగా కాళ్ళ చెప్పులు అరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.

The leader of the ruling party was sacrificed for the love of Karantolla..

ఇక వివరాల్లోకి వెళితే..కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ 8వ డివిజన్ గ్రామానికి చెందిన సిరిసిల్ల అంజయ్య అనే రైతుకు 82 ఎఫ్ సర్వే నెంబర్ లో 18 గుంటల భూమి ఉంది. ఇందులో అంజయ్య సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈ భూమి పక్కనే ఓ బీఆర్ఎస్ లీడర్ వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఇదివరకే 33 కేవీ కరెంట్ లైన్ ఉంది.

అయితే అక్కడ భూమి ధరలు పెరగడంతో భవిష్యత్ లో అమ్ముకోవాలనుకున్నప్పుడు ఇబ్బంది అవుతుందని ఆ లీడర్ తన పొలం నుంచి  లైన్ ను తొలగించి రైతు అంజయ్య పొలం నుంచి వేయించాడు. దీంతో పక్కనున్న లైన్ ను తొలగించి తన భూమిలో నుంచి వేయడం ఏంటని విద్యుత్ శాఖాధికారులను అంజయ్య నిలదీశాడు. అయితే బీఆర్ఎస్ నేతకు భూమి అమ్మే ఉద్దేశం ఉంటే చెప్పాలని డీఈ బేరసారాలకు దిగాడని, తనకు ఆ ఉద్దేశం లేదని చెప్పడంతో ఇబ్బందులు పెడుతున్నాడని రైతు అంజయ్య ఆరోపిస్తున్నాడు.

దీంతో ఆరునెలలుగా తన పొలంలో వేసిన విద్యుత్ లైన్ ను తొలగించి తనకు న్యాయం చేయాలని అదే విధంగా బీఆర్ఎస్ నేతకు అనుకూలంగా వ్యవహరించిన డీఈ పై యాక్షన్ తీసుకోవాలని అంజయ్య అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. చివరికి ప్రజావాణిలో మొరపెట్టుకున్నప్పటికీ అధికారులు తనకు న్యాయం చేయడం లేదని అంజయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని మరోసారి ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నాడు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe