సూర్యుడిపై ఆదిత్య ఎల్1 ప్రయోగానికి ముహుర్తం ఫిక్స్.. ప్రజలకు ఆహ్వానం

చంద్రయాన్-3 ప్రయోగంతో చంద్రుడిపై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడించిన ఇస్రో ఇక సూర్యుడిపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సూర్యుడి రహస్యాలు తెలుసుకునేందుకు ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం చేపట్టనుంది. ఈ సోలార్ మిషన్ చేపట్టేందుకు తాజాగా ముహుర్తం ఫిక్స్ చేసింది. ఈ ప్రయోగం ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రజలకు ఆహ్వానం అందించింది.

New Update
సూర్యుడిపై ఆదిత్య ఎల్1 ప్రయోగానికి ముహుర్తం ఫిక్స్.. ప్రజలకు ఆహ్వానం

చంద్రయాన్-3 ప్రయోగంతో చంద్రుడిపై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడించిన ఇస్రో ఇక సూర్యుడిపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సూర్యుడి రహస్యాలు తెలుసుకునేందుకు ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం చేపట్టనుంది. ఈ సోలార్ మిషన్ చేపట్టేందుకు తాజాగా ముహుర్తం ఫిక్స్ చేసింది. సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ మిషన్ ప్రయోగించనున్నట్లు ట్వీట్ చేసింది. శ్రీహరికోటలోని లాంచ్ వ్యూ గ్యాలరీ నుండి ఈ ప్రయోగం వీక్షించేందుకు ప్రజలు https://lvg.shar.gov.in/VSCREGISTRATION/index.jsp ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణ పరిస్థితుల్ని కనుగొనడం కోసమే ఈ ప్రయోగం చేపడుతున్నట్లు వెల్లడించింది.

భూమి నుంచి 1.5 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్ పాయింట్-1(L1) దగ్గర ఉండే దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి పీఎల్ఎల్‌వీ-సీ57 నౌక ద్వారా ఆదిత్య ఎల్‌-1ను చేరుస్తారు. భూమి నుంచి చంద్రుడికి ఎంత దూరం ఉందో.. అందుకు నాలుగు రెట్ల దూరంలో ఈ కక్ష్య ఉంది. 177 రోజుల పాటు ప్రయాణించి.. సూర్యుడి కక్ష్యలోకి ఆదిత్య ఎల్‌-1 చేరుకుంటుంది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు భారత్ ప్రయోగిస్తున్న తొలి స్పేస్ క్రాఫ్ట్ ఇదే. గతంలో అమెరికా, జర్మనీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు సూర్యుడిపైకి ఉపగ్రహాల్ని పంపించాయి. ఇప్పుడు సూర్యుడిపైకి ఉపగ్రహం పంపే నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. ఆదిత్య ఎల్-1లో మొత్తం ఏడు పేలోడ్లు ఉంటాయి. సూర్యుడి నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు వీలుగా ఈ పేలోడ్స్‌ని రూపొందించారు. నాలుగు పేలోడ్స్ నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తే.. మిగతా మూడు పేలోడ్స్ సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి.

ఇక చంద్రయాన్-3లోని ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లిపై తన పరిశోధనలు చేపడుతుంది. ఈ క్రమంలో రోవర్ ప్రయాణిస్తున్న మార్గంలో పెద్ద గొయ్యి ఉంది. వెంటనే అప్రమత్తమైన శాస్త్రవేత్తలు రోవర్ మార్గాన్ని మార్చారు. ఈ విషయాన్ని ఇస్రో ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం రోవర్ కొత్త మార్గంలో సురక్షితంగా ప్రయాణిస్తుందని చెబుతూ గొయ్యి ఫొటోతో పాటు రోవర్ ప్రయాణిస్తున్న గుర్తులను కూడా షేర్ చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు