BoAt Smart Ring : ఈ స్మార్ట్ రింగ్ తో మామూలుగా ఉండదు.. ఏం చేయగలదో తెలిస్తే షాక్ అవుతారు..!!

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్...ఇప్పటికే ఎన్నో స్మార్ట్‎వాచ్‎లను బడ్జెట్ ధరలకే వినియోగదారులకు అందించింది. ఇయర్ బడ్స్, హెడ్‎ఫోన్స్, స్పీకర్ వంటి ఉత్పత్తులను విడుదల చేసి భారత మార్కెట్లో సూపర్ పాపులర్ బ్రాండ్ గా నిలిచింది. ఇప్పుడు కంపెనీ సరికొత్తగా మరొక స్మార్ట్ ప్రొడక్టును రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ డివైజ్‎ను వేలుకు పెట్టుకుంటే..మీకు డాక్టర్ అవసరమే ఉండదు.

New Update
BoAt Smart Ring : ఈ స్మార్ట్ రింగ్ తో మామూలుగా ఉండదు.. ఏం చేయగలదో తెలిస్తే షాక్ అవుతారు..!!

స్మార్ట్ వాచ్ తర్వాత ఇప్పుడు స్మార్ట్ రింగ్ (BoAt Smart Ring) యుగం రాబోతోంది. ఇటీవల. ప్రముఖ టెక్ కంపెనీ Samsung రెండు స్మార్ట్ రింగ్ లను మార్కెట్లోకి విడుదల చేసింది. కానీ బోట్ (BoAt) ముందు... Samsung చతికిలా పడింది. సామ్‌సంగ్‌ను (Samsung) ఓడించి బోట్ తన స్మార్ట్ రింగ్‌ను విడుదల చేసింది. బోట్ స్మార్ట్ రింగ్ అనేది ఫిట్‌నెస్ ట్రాకర్. ఇది మీ హెల్త్ యాక్టివిటిస్‎ను (Health Activity) ట్రాక్ చేస్తుంది. అంతేకాదు బోలెడన్ని ఫీచర్లను అందించింది కంపెనీ. ఈ స్మార్ట్ రింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Boat Ring

ఈ స్మార్ట్ రింగ్‌ను తయారు చేయడానికి boAt సిరామిక్, మెటల్‌ను ఉపయోగించింది. కంపెనీ ప్రకారం, ఇది చాలా తేలికగా ఉంటుంది. దీని కారణంగా ఈ స్మార్ట్ రింగ్ ను (Smart Ring) చాలా కాలం పాటు సులభంగా ధరించవచ్చు. వినియోగదారులు ఈ స్మార్ట్ రింగ్‌ను ఫ్యాషన్ యాక్సెసరీగా కూడా ఉపయోగించవచ్చు. ప్రస్తుతానికి, ఈ స్మార్ట్ రింగ్ ధరను కంపెనీ ప్రకటించలేదు. త్వరలో దీని ధరను వెల్లడిస్తామని, కొనుగోలు చేయాలనుకునే వారు అమెజాన్ (Amazon) లేదా ఫ్లికార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చని boAt తెలిపింది. దీని మొదటి విక్రయం ఆగస్ట్ ప్రారంభంలో ఉండే ఛాన్స్ ఉన్నట్లు లీకులను బట్టి తెలుస్తోంది.

బోట్ స్మార్ట్ రింగ్ ఫీచర్స్:
- బోట్ స్మార్ట్ రింగ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌తో వస్తుంది, కాబట్టి దీనిని ధరించి కూడా స్విమ్మింగ్ చేయవచ్చు.
-తక్కువ బరువుతో, మీరు చాలా గంటలు, రోజుల తరబడి ధరించవచ్చు.
-ఈ స్మార్ట్ రింగ్‌లో, మీ హెల్త్ యాక్టివిటీస్ ను ట్రాక్ చేసే ఆప్షన్ను పొందుతారు.
-ఈ ప్రత్యేక రింగ్‌లో, మీరు స్టెప్ కౌంట్ నుండి క్యాలరీ బర్న్ వరకు సులభంగా చెక్ చేసుకోవచ్చు.
-స్మార్ట్ రింగ్ హార్ట్ రేటు, శరీర ఉష్ణోగ్రత, రక్తంలోని ఆక్సిజన్ స్థాయిని కూడా ట్రాక్ చేయగలదు.

Advertisment
తాజా కథనాలు