లవర్ తో కలసి ఓయోకు వెళ్లాడు..కొద్ది క్షణాలకే ప్రాణాలు విడిచాడు!

లవర్‌తో కలిసి ఓయోకు వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటన సంచలనంగా మారింది. హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే!

New Update
లవర్ తో కలసి ఓయోకు వెళ్లాడు..కొద్ది క్షణాలకే ప్రాణాలు విడిచాడు!

లవర్‌తో కలిసి ఓయోకు వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటన సంచలనంగా మారింది. హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. మ్యాటర్‌లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన హేమంత్‌ (28) ఇటుకల వ్యాపారం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతి(27)తో ఏడేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారితీసింది. మద్యం తాగి.. ఇద్దరూ కలిసి సోమవారం హైదరాబాద్‌లో ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. రాత్రి ఎస్సార్‌నగర్‌లోని ఓయో టౌన్‌హౌస్‌లో గది తీసుకొని ఉన్నారు. మద్యం తాగి హేమంత్‌ రాత్రి 2 గంటల సమయంలో బాత్రూమ్‌కు వెళ్లాడు. ఎంతకు బయటకు రాకపోవడంతో యువతి చూడగా అపస్మారకస్థితిలో పడి కనిపించాడు.

దీంతో యువతి హేమంత్‌ స్నేహితులకు చెప్పడంతో వారు వచ్చి హేమంత్‌ను మంచంపై పడుకోబెట్టి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. మృతిపై అనుమానాలు.. అంబులెన్స్‌ సిబ్బంది పరీక్షించి అప్పటికే హేమంత్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న హేమంత్‌ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడి మృతిపై అనుమానాలున్నాయని దర్యాప్తు చేయాలని కోరారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మృతి కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు