Devils Dung: ఆఫ్ఘనిస్తాన్ దెయ్యాల పేడ మన దేశానికి.. దాంతో ఏం చేస్తారో తెలిస్తే అవాక్కవుతారు!

ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రతి సంవత్సరం 1500 టన్నుల వరకూ దెయ్యాల పేడ మన దేశానికి దిగుమతి అవుతుంది. అసలు దెయ్యాల పేడ ఏమిటి? మన దేశంలోకి రావడం ఏమిటి? దానిని ఏమి చేస్తారు? ఇలాంటి ప్రశ్నలకు జవాబు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు 

Devils Dung: ఆఫ్ఘనిస్తాన్ దెయ్యాల పేడ మన దేశానికి.. దాంతో ఏం చేస్తారో తెలిస్తే అవాక్కవుతారు!
New Update

Devils Dung: ఈ హెడ్ లైన్ చూసి మీకు వచ్చే మొదటి డౌట్ దెయ్యాల పేడ  ఏమిటి అని కదూ. ఎదో ఆర్టికల్ చదివించడానికి ఇలా హెడ్ లైన్ ఇచ్చామనీ అనుకోవచ్చు. కానీ, కాదు. నిజంగానే దెయ్యం పేడ ఉంది. అది ఆఫ్ఘనిస్తాన్ నుంచి టన్నులకు తన్నులు మనదేశానికి దిగుమతి అవుతుంది. ఇక్కడ మీకింకో షాకింగ్ విషయం తెలుసా? ఈ దెయ్యాల పేడను దాదాపుగా మన దేశంలో ప్రతి ఒక్కరూ.. ప్రతిరోజూ తింటున్నారు. ఏంటి అర్ధం కాలేదా? ఇప్పుడు మీకొచ్చే అన్ని అనుమానాలకు సమాధానాలు ఇక్కడ చూద్దాం. 

దెయ్యంపేడ ఏమిటి?

Devils Dung: ఈ దెయ్యం పేడ.. ఇంగ్లీష్ లో డెవిల్స్ డంగ్ అసలు పేరు  'అసాఫోటిడా'. దీనికి డెవిల్స్ డంగ్ అని పేరు పెట్టింది బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే ఇది ఘాటైన మసాలా. ఇది భారతదేశంలో వంటల్లో కొద్దిగా వేస్తారు. దీని పరిమాణం కొద్దిగా ఎక్కువ అయినా.. దీని ఘాటు చాలా ప్రమాదాన్ని తెస్తుంది. ముద్దలా ఉండే దీని రూపాన్ని చూసి దీనిని డంగ్ అని పిలిచారు బ్రిటిషర్లు. దీని ఘాటు తెచ్చే ప్రమాదాన్ని చూసిన తరువాత దేనికి డెవిల్స్ డంగ్ అని పేరుపెట్టారు. ఇప్పుడు ఇంకా కన్ఫ్యూజ్ అయ్యారు కదూ. అసలు మన దేశంలో ఈ పేరుతో  ఏ మసాలా లేదే అని అనుకుంటున్నారు. మనం ఇంగువ అని పిలుచుకునే మసాలాకి మూల పదార్థమే ఈ  'అసాఫోటిడా'  లేదా డెవిల్స్ డంగ్. 

ఇంగువ చాలా ఫేమస్..

Devils Dung: ఇంగువ భారతదేశానికి చిక్కటి పాలు లేదా పేస్ట్ రూపంలో ఉండే  'అసాఫోటిడా’ రూపంలో వస్తుంది. ఇది కొంతవరకు ఫెవికాల్ లాగా ఉంటుంది.  కానీ దాని రంగు లేత గులాబీ రంగులో ఉంటుంది. ఇందులో ఒక సెట్ ఫార్ములా ప్రకారం పిండి, గమ్ కలుపుతారు. ఆ తర్వాత ఎండలో ఎండబెట్టి, చిన్న చిన్న ఇంగువ ముద్దలు తయారుచేస్తారు. ఈ ముద్దలను గ్రైండ్ చేయడం ద్వారా ఇంగువ పొడి రూపంలో తయారు చేస్తారు. 

డెవిల్స్ డంగ్ బిజినెస్..

Devils Dung: ఈ ఇంగువ పాలు (అసాఫోటిడా)ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశానికి దిగుమతి అవుతాయి. మనీ కంట్రోల్ రిపోర్ట్  ప్రకారం, భారతదేశం దిగుమతి చేసుకునే ఇంగువలో 90 శాతం ఆఫ్ఘనిస్తాన్ నుండి వస్తుంది. మిగిలిన 8 శాతం ఉజ్బెకిస్థాన్ నుండి, 2 శాతం ఇరాన్ నుండి వస్తుంది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్‌కు వస్తున్న ఈ 'దెయ్యాల పేడ' పరిమాణం దాదాపు 1500 టన్నులు కాగా, ఈ వ్యాపారం విలువ దాదాపు రూ.1,000 కోట్లు.

Devils Dung: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి, దాని వాణిజ్యంలో అనేక అడ్డంకులు తలెత్తాయి.  అయితే ఇప్పటికీ దాని వాణిజ్యం వివిధ మార్గాల్లో జరుగుతోంది. అదే సమయంలో, హిమాచల్ ప్రదేశ్‌లో స్వదేశీ ఇంగువను ఉత్పత్తి చేయడానికి భారతదేశం కూడా ప్రయత్నిస్తోంది. ప్రపంచంలోని మొత్తం ఇంగువ ఉత్పత్తిలో భారతదేశం 40 శాతం వినియోగిస్తోంది. దక్షిణాసియాలోని చాలా దేశాలలో, ఇది ప్రజల వంటగదిలో ప్రధాన మసాలాగా ఉంటోంది.

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe