Business Ideas:పెట్టుబడి తక్కువ..ఆదాయం ఎక్కువ..జాబ్ చేస్తునే లక్షలు సంపాదించుకునే ఐడియా..!! తక్కువ పెట్టుబడితో లక్షలు సంపాదించే వ్యాపారాలెన్నో ఉన్నాయి. ఉద్యోగం చేస్తూనే అదనపు ఆదాయం కోసం వ్యాపారం ప్రారంభించవచ్చు. అలాంటి వ్యాపారాలు ఈ ఎపిసోడ్ మీకోసం పరిచయం చేస్తున్నాం. By Bhoomi 18 Jul 2023 in బిజినెస్ Scrolling New Update షేర్ చేయండి ఈ మధ్యకాలంలో చాలా మంది ఉద్యోగాల కంటే వ్యాపారాలపై ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. చాలీచాలని జీతాలతో బతకడం కంటే..ఏదైనా వ్యాపారం ప్రారంభించి మంచి ఆదాయాన్ని పొందాలనుకుంటున్నారు. మరికొందరు ఉద్యోగం చేస్తూనే..సైడ్ ఇన్ కమ్ కోసం ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. కానీ ఎలాంటి బిజినెస్ ప్రారంభించాలి...ఎక్కడ ప్రారంభించాలి..పెట్టుబడి ఎంత పెట్టాలి..ఇలాంటి విషయాలు తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికోసమే ఈ ఎపిసోడ్లో కొన్ని చక్కటి వ్యాపారాల గురించి మీకు తెలియజేస్తాం. మీరు ఉద్యోగం చేస్తూనే...తక్కవ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని పొందవచ్చు. అవేంటో చూద్దాం. బేకింగ్: మీకు బేకింగ్ అంటే ఇష్టమైతే...మీరు ఇంట్లోనే బేకరీని ప్రారంభించవచ్చు. కస్టమైజ్ చేసిన కేకులు, పేస్ట్రీలు, కుకీలు, మూసీలు, బేక్డ్ గూడ్స్ వంటి వాటిని ఇంట్లోనే తయారు చేసి ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చు. మీ వంటగదిలో బేకింగ్ సెటప్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఫలితంగా పెట్టుబడి కూడా అవసరం లేదు. అయితే ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు, మీరు మీ సోషల్ మీడియా నైపుణ్యాలను పెంచుకోవాలి. ఎంబ్రాయిడరీ: మీరు ఎంబ్రాయిడరీ పనిలో నైపుణ్యం కలిగి ఉంటే ఈ వ్యాపారం చాలా బాగుంటుంది. ఫ్యాషన్ పరిశ్రమలో ట్రెండ్ ఎప్పుడూ ఉంటుంది. ఫలితంగా బట్టలు, చీరలు మొదలైన వాటిపై ఎంబ్రాయిడరీ వర్క్ చేయడం వంటి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీరు మగ్గం వర్క్ కూడా చేయవచ్చు. కానీ అది సాధ్యం కాకపోతే, నీడిల్ ఎంబ్రాయిడరీ మెషీన్ను ఉపయోగించవచ్చు. దీని ధర 14000 నుండి 16000 రూపాయల మధ్య ఉంటుంది. మంచి డిజైన్లు తయారు చేసి విక్రయించడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. వెబ్ డిజైనింగ్: ఇంటర్నెట్ యుగంలో ఆన్‌లైన్ బిజినెస్ చాలా డెవలప్ అయ్యింది. అంతే కాదు, వ్యాపారాన్ని ఎక్కువ మందికి ప్రచారం చేయడానికి ఇంటర్నెట్ కూడా ఉపయోగపడుతుంది. అయితే, ప్రమోషన్‌తో పాటు, పోటీదారులతో ఢీకొట్టేందుకు వివిధ కంపెనీలు వెబ్‌సైట్‌లను తయారు చేస్తున్నాయి. దీని కోసం వారు వివిధ వెబ్ డిజైనింగ్ ఏజెన్సీలతో కమ్యూనికేట్ చేస్తారు. కొన్ని కంపెనీలు ఈ పని కోసం ఫ్రీలాన్సర్ల కోసం కూడా సెర్చ్ చేస్తున్నాయి. దీంతో వెబ్ డిజైనింగ్ ఉద్యోగాలకు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. ఈ పనిలో నైపుణ్యం ఉంటే మీరే స్వంతగా వెబ్ డిజైనింగ్ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. హ్యాండ్ పెయింటింగ్: ఈ రోజుల్లో హ్యాండ్ పెయింటింగ్ చాలా డిమాండ్ ఉంది. బట్టలు, చీరలు, శాలువాలు, స్టోల్స్ నుండి కోస్టర్లు, కాఫీ మగ్‌లు, కప్పులు మొదలైన వాటి వరకు హ్యాండ్ పెయింటింగ్ వ్యాపారం ప్రారంభించవచ్చు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా లేదా ఎవరికి నచ్చిన విధంగా డిజైన్‌ను గీసి ఇంట్లోనే ఆన్‌లైన్‌లో విక్రయించే అవకాశం ఉంది. ఇంట్లో ఈ వ్యాపారం ప్రారంభిస్తాం కాబట్టి పెట్టుబడి అవసరం లేదు. (Disclaimer:ఈ కథనం ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగానే ఇవ్వబడింది. ఆర్టీవీ(RTV) దీన్ని ధృవీకరించలేదు, బాధ్యత వహించదు. వీటిని అమలు చేసే ముందు సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం) #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి