Crime News: భార్యకు గుండు గిసి చిత్రహింసలు పెట్టిన భర్త..!

తూర్పుగోదావరి జిల్లా పెదకొండేపూడిలో వివాహితపై భర్త అమానుషంగా ప్రవర్తించిన ఘటన చోటుచేసుకుంది. అనుమానంతో భార్యకు గుండు గిసి చిత్రహింసలు పెట్టాడని తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న సీతానగరం పోలీసులు ఆమెను వైద్య పరీక్షలు నిమిత్తం రాజమండ్రికి తరలించారు.

New Update
Crime News: భార్యకు గుండు గిసి చిత్రహింసలు పెట్టిన భర్త..!

Crime News: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడిలో వివాహితపై భర్త అమానుషంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అనుమానం అనే నెపంతో భార్యను వదిలించుకునేందుకు భర్త రాంబాబు ఆమెకు గుండు గిసి చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. వెంటనే హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న సీతానగరం పోలీసులు ఆమెను వైద్య పరీక్షలు నిమిత్తం రాజమండ్రికి తరలించారు. అయితే, గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: గంటా శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వకండి: తోట రాజీవ్

శిరో ముండనం చేయకముందు తన భర్త వేధింపులను ఓ సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించింది భార్య ఆశా. చిత్ర పరిశ్రమలో షూటింగ్ నేపథ్యంలో పెదకొండేపూడి వచ్చిన రాంబాబు..తనని ప్రేమించానని నమ్మించాడని చెప్పింది. అయితే, తనకు చిన్నతనంలో పెళ్లి జరిగిందని, ఒక బాబు కూడా ఉన్నాడని వెల్లడించింది. భర్త చనిపోయి ఉన్న తనకు పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇద్దరూ కొన్ని నెలల తరువాత ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది.

Also Read: జవహర్ వద్దు – టీడీపీ ముద్దు.. బయటపడ్డ వర్గ విభేదాలు..!

పెళ్లి జరిగిన ఒక సంవత్సరం వరకు బాగా చూసుకున్నాడని తరువాత అతడు వేరే అమ్మాయితో ఆఫేర్ పెట్టుకుని తనను వేధించేవాడని వీడియోలో ఆరోపించింది. బాధిరాలు ఫిర్యాదు తో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్ ఐ రామకృష్ణ వెల్లడించారు.. ఇలా ప్రేమ వివాహం కాస్త ఇప్పుడు శిరోముండనం వరకు దారి తీసింది.

Advertisment
తాజా కథనాలు