మహిళ ప్రాణం తీసిన కోడిగుడ్డు కూర..! అసలేం జరిగిందంటే.? పండగ పూట గుడ్డు కూర వండలేదని భార్యను అతి కిరాతకంగా చంపేశాడు ఓ భర్త. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. క్షణికావేశంతో భార్య గొంతు నుమిలి చంపేశాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. By Jyoshna Sappogula 25 Oct 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి The husband brutally killed his wife: కోడిగుడ్డు కూర కొంప ముంచింది. తనకు ఇష్టమైన కూర వండలేదని భార్యను అతికిరాతకంగా చంపాడు భర్త. ఈ ఘటన ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లాలో చోటుచేసుకుంది. కోడిగుడ్డు (Egg Curry)తినాలనుకున్న భర్తకు పండగ కారణంగా భార్య చేసిపెట్టలేదు. ఆ చిన్న సమస్య ఒకరి ప్రాణాలు తీసేందుకు దారి తీసింది. Also Read: తెలంగాణను మూడు వారాల ముందే చుట్టేసిన చలి.. అక్కడ కేవలం 13 డిగ్రీలే.. జగిత్యాల పట్టణంలోని టీఆర్‌నగర్‌కి చెందిన కట్ట సంజయ్, సుమలత దంపతుల మధ్య కోడిగుడ్డ కూర గొడవకు ప్రాణాల మీదికి తెచ్చింది. మద్యం తాగివచ్చిన భర్త సంజయ్ కోడిగుడ్డు కూర వండమని భార్య సుమలతను అడిగాడు. అయితే, భార్య కూర చేసేందుకు ఒప్పుకోలేదు. దీంతో, తాను చెప్పినట్లు చేయలేదనే కోపంతో భార్యపై గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగింది. ఆమె కూడా ఎదురు చెప్పడంతో చిన్న గొడవ కాస్తా పెద్ద వివాదంగా మారింది. భార్యతో గొడవపడిన సంజయ్ తీవ్ర కోపోద్రిక్తుడై భార్యపై దాడి చేశాడు. ఆ క్షణికావేశంలో సంజయ్ భార్య సుమలత గొంతు నులిమి చంపేశాడు. Also Read: ఫలించిన కేసీఆర్ వ్యూహం.. రోడ్ రోలర్ సింబల్ కు చెక్.. ఎలాగో తెలుసా? స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుమలత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులతో పాటు చుట్టు పక్కల వారి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. అయితే గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు తెలిపారు. స్థానికుల చెప్పిన వివరాల మేరకు పోలీసులు ఆయా కోణాల్లో విచారణ చేస్తున్నారు. #karimnagar #husband-brutally-killed-his-wife మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి