ఆదివాసీపై మూత్రం పోసిన నిందితుడి ఇల్లు.. బుల్డోజర్తో కూల్చేసిన చౌహాన్ సర్కార్..!! నేరస్తుల గుండెల్లో గుబులు పుట్టించే బుల్డోజర్ కల్చర్ యూపీ నుంచి మధ్యప్రదేశ్ కు వ్యాపించింది. ఆక్రమణదారులు, గ్యాంగ్ స్టర్లు, సంఘవ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పుడుతున్న వారి పట్ల యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నిందితులు ఆస్తులను బుల్డోజర్లతో నేటమట్టం చేస్తోన్న ఘటనలను ఇప్పటివరకు ఎన్నో చూశాం. ఈ కల్చర్ ఇప్పుడు మధ్యప్రదేశ్ కు పాకింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కూడా బుల్డోజర్ లను ఉపయోగిస్తూ నేరస్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అమానవీయ ఘటనలకు పాల్పడుతున్న వారి ఆస్తులను బుల్డోజర్ తో నేలమట్టం చేస్తున్నారు. ఇటీవల గిరిజనుడిపై ఓ వ్యక్తి మూత్రం పోసిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఈ ఘటనను చౌహన్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. నిందితుడి ఇంటిని బుల్డోజర్ తో నేలమట్టం చేసింది. By Bhoomi 06 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి ఆదివాసీపై ఓ వ్యక్తి మూత్రం పోసిన ఘటన మధ్యప్రదేశ్ లో పెద్ద దుమారమే రేపింది. సిధి జిల్లాకు చెందిన నిందితుడు పర్వేజ్ శుక్లాను బుధవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని ఇంటిని బుల్డోజర్లతో కూల్చివేశారు. అతని మీద ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టంతోపాటు పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది చౌహాన్ సర్కార్. అయితే పర్వేజ్ శుక్లా తమ పార్టీకి చెందినవాడంటూ వస్తున్న కథనాలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై నలుగురు సభ్యులతో కమిటీ వేసింది. పర్వేజ్ శుక్లా ఆదివాసీపై మూత్రంపోసిన వీడియో మంగళవారం వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వరకు వెళ్లింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిపై కేసు నమోదు చేసిన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకున్న వెంటనే, అతన్ని అరెస్టు చేశారు. రేవా జైలుకు తరలించారు. అనంతరం నిందితుడిని బుల్డోజర్లతో కూల్చివేశారు. ఈ ఘటనపై శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. సిద్ధి సంఘటన వీడియో చూసి చాలా బాధపడ్డాను. ఈ ఘటన చాలా హృదయ విదారకంగా ఉంది. గిరిజనుడికి న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాను.అతని కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడికి కఠిన శిక్షను అమలు చేస్తామని సీఎం ట్వీట్ చేశారు. మానవత్వానికి అవమానం: రాహుల్ గాంధీ బీజేపీ పాలనలో గిరిజన సోదర సోదరీమణులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేత చేసిన అమానవీయ నేరంతో యావత్ మానవాళి సిగ్గుతో తలదించుకుందని ట్వీట్ చేశారు. ఆదివాసీలు, దళితుల పట్ల బిజెపికి ఎంత ద్వేషం ఉందో ఈ ఘటనతో బయటపడిందంటూ ట్వీట్ చేశారు. బీజేపీకి అధికారం మత్తు వచ్చిందా: కమల్ నాథ్ గిరిజన సోదరులు, సోదరీమణులను అవమానించిన ఘటనలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు కమల్ నాథ్. సిద్ధి జిల్లాలో ఓ గిరిజన యువకుడిపై బీజేపీ నేత మూత్ర విసర్జన చేసిన వీడియో చూసి ఆత్మ వణికిపోయిందన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులకు మనుషులను మనుషులుగా చూడని స్థాయిలో అధికార మత్తు తగిలిందా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కోట్లాది మంది గిరిజన సోదర సోదరీమణులను అవమానించడమే అని అన్నారు. గిరిజన సంఘంపై జరుగుతున్న దౌర్జన్యాలకు ప్రభుత్వ రక్షణ కల్పించాలని శివరాజ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. గిరిజన సమాజానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటూ వారికి న్యాయం చేస్తూనే ఉంటుందని వెల్లడించారు. నిందితుల ఆస్తులను కూల్చివేయాలి: మాయావతి గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన ఘటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఘాటుగా స్పందించారు. నిందితుడైన బీజేపీ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, అతని ఆస్తులను జప్తు చేసి కూల్చివేయాలని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో గిరిజన యువకుడిపై స్థానిక ఆధిపత్య నాయకుడు మూత్ర విసర్జన చేసిన ఘటన చాలా సిగ్గుచేటు అని మాయావతి ట్వీట్ చేశారు. ఈ అమానుష చర్యను ఎంత ఖండించినా తక్కువే అన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి