AP High Court: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ ను రిజర్వ్ చేసిన హైకోర్టు

స్పీకర్ తమ్మినేని సీతారాం జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం ఆర్డర్స్ ను రిజర్వ్ చేసింది. కాగా, పార్టీ మార్పుపై వివరణకు కొంత సమయం కావాలని వారు కోరారు.

New Update
AP High Court: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ ను రిజర్వ్ చేసిన హైకోర్టు

AP High Court: వైసీపీ(YCP) రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లు సొంత పార్టీని వీడి టీడీపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నలుగురి పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు నలుగురు రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం(Tammineni Sitaram) నోటీసులు జారీ చేశారు.

Also Read: ఇలాంటి వారు వైఎస్సార్ వారసులు ఎలా అవుతారు?.. అన్న జగన్ ను టార్గెట్ చేసిన షర్మిల..!

అనర్హత పై వివరణ ఇచ్చుకోవడానికి కొంత సమయం కావాలని నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కోరారు. అయితే, స్పీకర్ జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ వాదనలు వినకుండా.. సరైన డ్యాకుమెంట్స్  ఇవ్వకుండా.. మా మీద చేసిన ఆరోపణల ఆధారాలు చూపించకుండా మా వివరణ ఎలా ఇస్తాం? విచారణకు రావాలంటూ తమకు నోటీసులు ఇచ్చారని పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం ఆర్డర్స్ ను రిజర్వ్ చేసింది.

Advertisment
తాజా కథనాలు