Talasila Raghuram: వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం పిటిషన్‌పై విచారణ వాయిదా

AP: వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ తలశిల పిటిషన్‌ దాఖలు చేశారు. 2021లో టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

New Update
Talasila Raghuram: వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం పిటిషన్‌పై విచారణ వాయిదా

Talasila Raghuram: వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ తలశిల పిటిషన్‌ దాఖలు చేశారు. 2021లో టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్‌ విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి కూడా..

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకుమ్మడి దాడి కేసులో అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చేసిన అభ్యర్ధనను హైకోర్టు తోసిపుచ్చింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది (జీపీ) కేఎం కృష్ణారెడ్డి కోరడంతో విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. 

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. మూడేళ్ల కిందట నమోదైన కేసును తెరపైకి తెచ్చి అరెస్టులు చేస్తున్నారన్నారు. పిటిషనర్ కు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని కోరారు. పోలీసుల తరఫున జీపీ కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. తెదేపా పార్టీ కార్యాలయంపై 2021లో వైకాపా నేతల కనుసన్నల్లో మూకుమ్మడి దాడి చేశారన్నారు. అప్పట్లో కేసు నమోదు చేసినా.. దర్యాప్తులో పురోగతి లేదన్నారు. ప్రస్తుతం దర్యాప్తు మొదలు పెట్టేసరికి బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నారన్నారు. అరెస్టు నుంచి రక్షణ ఇవ్వొద్దని కోరారు.

Also Read: పవన్‌కు మరో పరీక్ష.. ఆయన ఇలాకాలో మహిళ మిస్సింగ్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు