/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ganta-1-jpg.webp)
TDP MLA Ganta Srinivasa Rao: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2022 ఫిబ్రవరిలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. అయితే, దాదాపు మూడేళ్ల తరువాత తన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారం ఆమోదించారు. తీరా ఎన్నికల ముందు రాజీనామాకు ఆమోదం తెలపడంపై ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీని వెనుక రాజకీయ కోణం ఉందని హై కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్.
Also Read: హైకోర్టుకు ఆ నలుగురు ఎమ్మెల్యేలు..!
తన రాజీనామాను స్పీకర్ ఏకపక్షంగా అమోదించడంపై హై కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారించిన న్యాయస్థానం అసెంబ్లీ సెక్రటరీని ప్రతివాదిగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ అసెంబ్లీ స్టాండింగ్ కౌన్సిల్, ఎన్నికల కమిషన్, ప్రభుత్వంకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణ మూడు వారాల పాటు వాయిదా వేసింది.
Also Read: అనంతపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వార్డెన్ ఆకృత్యాలు.!
కాగా, ఏపీలో త్వరలో ఖాళీ కానున్న 3 రాజ్య సభ స్థానాలకు మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికల నాటికి టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్యా బలం తగ్గించేందుకు అధికార పార్టీ వైసీపీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే గంటా పదవి రాజీనామాకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.