Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర..

మహిళా రిజర్వేషన్ బిల్లు(నారీ శక్తి వందన్ చట్టం)కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్రం వేశారు. ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది. రాష్ట్రపతి ఆమోదానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర..
New Update

Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు(నారీ శక్తి వందన్ చట్టం)కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్రం వేశారు. ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది. రాష్ట్రపతి ఆమోదానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ బిల్లును ఆమోదిస్తూ ద్రౌపది ముర్ము కీలక వ్యాఖ్యలు చేశారు. లింగ సమానత్వం కోసం తీసుకువచ్చిన ఈ బిల్లును ప్రస్తుత కాల అత్యంత పరివర్తనాత్మక విప్లవంగా పేర్కొన్నారు. కాగా, ఈ నారీ శక్తి వందన్ బిల్లును సెప్టెంబర్ 20వ తేదీన లోక్‌సభలో ఆమోదించగా.. సెప్టెంబర్ 21వ తేదీన రాజ్యసభలో ఆమోదించారు. ఏదైనా బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందితే.. ఆ బిల్లు చట్ట రూపంలోకి మారడానికి రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. అందుకు.. పార్లమెంట్ ఆమోదం తరువాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభించనున్నాయి. అయితే, ఈ బిల్లు తదుపరి ఎన్నికల నాటికి అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఇదే..

publive-image

publive-image

Also Read:

Nara Lokesh: స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా లోకేష్ కు స్వల్ప ఊరట.. హైకోర్టు కీలక ఆదేశాలు

Vishal: సెన్సార్ బోర్డుపై హీరో విశాల్ చేసిన కామెంట్స్ వైరల్.. కేంద్ర ప్రభుత్వం సీరియస్..!

#womens-reservation-bill #president-droupadi-murmu #gazette-notification #government-of-india
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe