Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర.. మహిళా రిజర్వేషన్ బిల్లు(నారీ శక్తి వందన్ చట్టం)కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్రం వేశారు. ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది. రాష్ట్రపతి ఆమోదానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. By Shiva.K 29 Sep 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు(నారీ శక్తి వందన్ చట్టం)కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్రం వేశారు. ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది. రాష్ట్రపతి ఆమోదానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ బిల్లును ఆమోదిస్తూ ద్రౌపది ముర్ము కీలక వ్యాఖ్యలు చేశారు. లింగ సమానత్వం కోసం తీసుకువచ్చిన ఈ బిల్లును ప్రస్తుత కాల అత్యంత పరివర్తనాత్మక విప్లవంగా పేర్కొన్నారు. కాగా, ఈ నారీ శక్తి వందన్ బిల్లును సెప్టెంబర్ 20వ తేదీన లోక్‌సభలో ఆమోదించగా.. సెప్టెంబర్ 21వ తేదీన రాజ్యసభలో ఆమోదించారు. ఏదైనా బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందితే.. ఆ బిల్లు చట్ట రూపంలోకి మారడానికి రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. అందుకు.. పార్లమెంట్ ఆమోదం తరువాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభించనున్నాయి. అయితే, ఈ బిల్లు తదుపరి ఎన్నికల నాటికి అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఇదే.. Also Read: Nara Lokesh: స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా లోకేష్ కు స్వల్ప ఊరట.. హైకోర్టు కీలక ఆదేశాలు Vishal: సెన్సార్ బోర్డుపై హీరో విశాల్ చేసిన కామెంట్స్ వైరల్.. కేంద్ర ప్రభుత్వం సీరియస్..! #president-droupadi-murmu #womens-reservation-bill #government-of-india #gazette-notification మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి