వడదెబ్బ వల్లే ఆ 57 మంది మరణించారా? దర్యాప్తునకు సర్కార్ ఆదేశం..!!

ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లా ఆసుపత్రిలో మూడు నాలుగు రోజుల్లో మొత్తం 57 మంది మరణించారు. ఇంత బారీ సంఖ్యలో మరణాలు నమోదు కావడంతో సర్కర్ అప్రమత్తమైంది. ఇద్దరు నిపుణులతో కూడిన కమిటిని నియమించింది. ఆసుపత్రిలో రోగులు వడదెబ్బ కారణంగా మరణించారని ఖచ్చితమైన ఆధారాలు లేవని కమిటిలోని ఒక సభ్యుడు ఏకే సింగ్ తెలిపారు. రోగుల మరణాలకు గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి రిపోర్టు అందిస్తామని చెప్పారు.

New Update
వడదెబ్బ వల్లే ఆ 57 మంది మరణించారా? దర్యాప్తునకు సర్కార్ ఆదేశం..!!

యూపీలోని బలియా జిల్లా ఆసుపత్రిలో గత నాలుగు రోజుల్లో 57మంది మరణించారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ మరణాలకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆదివారం లక్ నవూ నుంచి బలియా చేరుకుంది. వడదెబ్బ వల్లే 57 మరణించారా లేదా ఏదైనా ఇతర కారణాల వల్ల మరణించారా? అనే కోణంలో బలియా ప్రభుత్వాసుపత్రిలో కమిటీ దర్యాప్తు జరుపుతోంది.

57 die at Ballia hospital

కాగా హీట్ వేవ్ కారణంగా బలియా జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మూడు నాలుగు రోజుల్లో 20మంది మరనించారని ఆ ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ దివాకర్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సర్కార్ మండిపడింది. దీంతో దివాకర్ సింగ్ ను అజంగఢ్ జిల్లాసుపత్రికి బదిలీ చేసింది. ఆయన స్థానంలో కొత్త సీఎంఎస్ గా ఎస్ కే యాదవ్ కు బాధ్యతలను అప్పగించింది.

అటు బలియా ఆసుపత్రిలో రోగుల మరణాల పట్ల యూపీ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ సంతాపం వ్యక్తం చేశారు. రోగులు ఏ కారణం చేత మరణించారో తెలుసుకునేందుకు ప్రభుత్వం కమిటీ వేసిందని తెలిపారు. ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే మరణాలకు గల కారణాలు తెలుస్తాయని తెలిపారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైద్య సిబ్బంది విధినిర్వహణలో అలర్ట్ గా ఉండాలని కోరారు.

బలియా జిల్లా ఆసుపత్రికి చికిత్స కోసం వస్తున్న రోగుల్లో చాలా మంది మొదటి ఛాతీనొప్పితో చేరుతున్నారని..శ్వాస తీసుకోవడం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి రక్త, మూత్ర పరీక్షలు చేస్తున్నారు. కొందరు రోగులు భయంతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. చాలామంది రోగుల్లో కొందరికి మాత్రమే అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వడదెబ్బ కారణంగా మరణాలు సంభవించాయనడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఎందుకంటే వడదెబ్బ రాష్ట్రవ్యాప్తంగా ఉంది..ఏ జిల్లాలోనూ ఈ స్థాయిలో మరణాలు సంభవించలేదు. ఆసుపత్రిలో చేరిన రెండు మూడు గంటల్లోనే చనిపోతున్నారు. అయితే ఈ మరణాలకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియలేదు. ప్రభుత్వానికి రిపోర్టు అందిస్తామంటూ కమిటీలోని ఒకరైన ఏకే సింగ్ వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు