విద్యార్థులకు అలర్ట్... రేపు విద్యాసంస్థలకు సెలవు..!! తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీవర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (జూలై 28) కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. By Bhoomi 27 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలో నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. జిల్లాల్లోవాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదలో చిక్కుకున్నాయి. రాష్ట్రంలో వరద పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్...రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్ నుంచి ఎప్పటికప్పుడు వరద తీవ్రత గురించి పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్, ఇప్పటికే బుధ, గురువారాల్లో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో శుక్రవారం కూడా సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో తిరిగి సోమవారం బడులు తెరుచుకోనున్నాయి. ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భారీవర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగానికి సహకరించేందుకు పలు జిల్లాలకు ఐఏఎస్ అధికారులను, ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. ములుగు - కృష్ణ ఆదిత్య, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సభ్య కార్యదర్శి, భూపాల పల్లి - పి గౌతమ్, సెర్ప్, సీఈవో, నిర్మల్ - ముషారఫ్ అలీ, ఎక్సైజ్ శాఖ, కమీషనర్ , మంచిర్యాల - భారతి హోలికేరి, మహిళా, శిశు సంక్షేమ శాఖ, స్పెషల్ సెక్రెటరీ, పెద్దపల్లి - సంగీత సత్యనారాయణ, ఆసిఫాబాద్ - హన్మంత రావు, పంచాయితీరాజ్ శాఖ కమీషనర్ నిమయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు. మోరంచపల్లిలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్ ను పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ మిలటరీ అధికారులతో సీఎస్ శాంతికుమారి సంప్రదింపులు జరిపి.. సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్ వినియోగించడం కష్టవుతుండటంతో సైన్యంతో ప్రభుత్వం చర్చలు జరిపారు. సైన్యం అంగీకారం తెలపడంతో ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లను మోరంచపల్లికి పంపిస్తున్నామని సీఎస్ శాంతికుమారి తెలిపారు. కాగా బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భూపాలపల్లి జిల్లాలోని మొరంచవాగు ఉగ్రరూపం దాల్చింది. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై మొరంచపల్లి వద్ద సుమారు 15 అడుగుల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మోరంచపల్లి గ్రామాన్ని వరద ముంచెత్తింది. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో బిల్డింగ్ లు, చెట్లపైకి ఎక్కి ప్రజలు తమ ప్రాణాలను రక్షించుకున్నారు. మోరంచపల్లి గ్రామంలో సుమారు వెయ్యి జనాభా ఉన్నట్లు తెలుస్తోంది. అటు ఏపీని వానలు ముంచెత్తుతున్నాయి. రెండు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీ సర్కార్ ముందస్తు జాగ్రత్తగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ఈనెల 29న మొహర్రం పండగ ఉంది. దీంతో స్కూళ్లకు సెలవు ఉంటుంది. దీంతో పాఠశాలలకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఎన్టీఆర్, విశాఖ, నంద్యాల జిల్లాల్లోనూ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే ఏలూరు ఏజెన్సీ ప్రాంతాల్లోని కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం, బుట్టాయిగూడెంతో పాటూ పలు మండలాల్లో స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు. ఇక నంద్యాలలో నాలుగు రోజుల పాటూ పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు అధికారులు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భారీ వర్షాల కారణంగా అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి