కామాంధులు ముక్కుపచ్చలారని బాలికను చిదిమేశారు..గుండె పగిలిన తండ్రి చిన్నారి చితిలోకి దూకాడు..ఇంతలో!!

కామాంధులు ముక్కుపచ్చలారని బాలికను చిదిమేశారు..దీంతో కడుపుకోతను భరించలేని ఓ తండ్రి గుండెలు పగిలేలా ఏడ్చాడు. కంటి ముందు కన్నపేగు కాలి బూడైతుంటే.. భరించలేకపోయాడు. తన కళ్లముందే కంటి వెలుగు, చిన్నారి చితి అవుతుంటే.. తాను బతకడమే దండగా అనుకున్నాడు. అంతే.. అందరూ చూస్తుండగా.. చితిలోకి ఆహుతి అవ్వడానికి దూకేశాడు...ఇంతలో...

కామాంధులు ముక్కుపచ్చలారని బాలికను చిదిమేశారు..గుండె పగిలిన తండ్రి చిన్నారి చితిలోకి దూకాడు..ఇంతలో!!
New Update

కాంక్రీట్ జంగిల్ లో కామాంధులు మానవ మృగాల్లా సంచరిస్తున్నారు. అకాశం దొరికితే చాలు తమలోని పైశాచికత్వానికి అభం శుభం తెలియని చిన్నారులను సైతం బలి తీసుకుంటారు. ఈ సంఘటనలు చోటుచేసుకున్నప్పుడల్లా సభ్యసమాజంలోనే మనం బతుకుతున్నామా..ఇలాంటి విషయాల్లో మన కన్నా.. మృగాలే మిన్నా.. అన్న భావన కల్గకుండా ఉండదు. ఆడపిల్లను కని, పెంచడమే పెద్ద బరువుగా భావిస్తున్న ఈ రోజుల్లో.. ఆ ఆడపిల్లను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా.. కామాంధులు మాత్రం కాటేస్తుంటే.. చివరికి కన్నవారికి కడుపుకోతే.. మిగులుతోంది.

ఇలాంటి కడుపుకోతనే భరించలేని ఓ తండ్రి గుండెలు పగిలేలా ఏడ్చాడు. కంటి ముందు కన్నపేగు కాలి బూడైతుంటే.. భరించలేకపోయాడు. తన కళ్లముందే కంటి వెలుగు, చిన్నారి చితి అవుతుంటే.. తాను బతకడమే దండగా అనుకున్నాడు. అంతే.. అందరూ చూస్తుండగా.. చితిలోకి ఆహుతి అవ్వడానికి దూకేశాడు.

ఈ హృదయవిదారమైన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భిల్వారా జిల్లాలో కోట్ర గ్రామంలో పద్నాగేళ్ల చిన్నారి సామూహిక అత్యాచారానికి బలైంది. ఆ బాలిక పశువులను కాచేది. ఆమెను అదే గ్రామానికి చెందిన పది మంది దుర్మార్గులు అపహరించి లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హతమార్చారు. అయితే ఆ బాలిక కొన్ని రోజుల నుంచి కనిపించకుండా పోయింది.

వెతుకున్న తండ్రికి.. చివరికి చితిపై కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన ఆ తండ్రి గుండెలవిసేలా ఏడ్చాడు. ఆత్మహుతి చేసుకునేందుకు ఆ చితిపైకే ఉరికాడు. దీంతో పక్కనున్న వారు అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. కాగా, అతడికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఈ కేసులో అదే గ్రామానికి చెందిన ఆరుగురు పురుషులు, నలుగురు ఆడవాళ్లు నిందితులుగా ఉన్నారు. ఆ ఆడవాళ్ళే బాలికను పట్టుకొని మగవారికి అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. మరి నిందితులకు ఎలాంటి శిక్ష పడుతుంది.. ఆ తండ్రికి న్యాయం ఎలా దక్కుతుందన్నది వేచి చూడాలి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి