సల్మాన్ ను వదిలే ప్రసక్తే లేదు.. చంపి తీరుతాం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను వివాదాలు వదిలేలా లేవు. సల్మాన్ ఖాన్ తెలిసీతెలియక చేసిన కొన్ని తప్పులు, తెలిసి చేసిన కొన్ని పొరపాట్ల వల్ల నరకం చూస్తున్నాడు. ఇప్పటికే పలు కేసుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సల్మాన్ ఖాన్...ఇప్పుడు ప్రాణభయంతో గడుపుతున్నారు. చుట్టూ సెక్యూరిటీని వేసుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కూడా రక్షణ కల్పించింది. అయినా కూడా ఎలాగైనా సల్మాన్ ఖాన్ చంపుతామంటూ గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ వార్నింగ్ ఇచ్చాడు. ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గోల్డీ బ్రార్ ఈ హెచ్చరికలు జారీ చేశాడు. By Bhoomi 28 Jun 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ను వరుస వివాదాలు.. వదిలేలా కనిపించడం లేదు. సల్మాన్ ఖాన్ చేసిన కొన్ని తప్పులకు ఇప్పుడు నరకం చూడాల్సి వస్తుంది. ఇప్పటికే ఎన్నో కేసుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సల్మాన్..ఇప్పుడు ప్రాణభయంతో గడపాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్లినా పక్కన సెక్యూరిటీ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాదు ప్రభుత్వం కూడా సల్మాన్ ఖాన్ కు ప్రత్యేక రక్షణ కల్పించింది. సల్మాన్ ఖాన్ వదిలేది లేదని..ఎలాగైన చంపుతామంటూ గ్యాంగ్ స్టర్ గ్రోలి బ్రార్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే కొంతకాలంగా సల్మాన్ ఖాన్ చంపుతామంటూ బెదిరింపులు మెసేజ్ లు వచ్చాయి. చాలా కాలంగా తమ శ్రతువుగా ఉన్న సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ గ్రోలిబ్రార్ అనుచరులు పలుమార్లు ఈమెయిళ్ల ద్వారా వార్నింగ్ ఇచ్చారు. గతేడాది మేలో జరిగిన పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా హత్యకేసు ప్రధాన సూత్రధారి గ్రోల్డీబ్రారేనని పోలీసులు చెబుతున్నారు. గోల్డీ బ్రార్‌ను కాలిఫోర్నియా పోలీసులు అరెస్టు చేశారు. మీడియా నివేదికల ప్రకారం, గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను నవంబర్ 20న అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అరెస్ట్‌కు సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు. సిద్దూ ముసేవాలా హత్య తర్వాత సల్మాన్ ఖాన్‌ను హత్య చేస్తానంటూ హెచ్చరించాడు. గత కొన్ని నెలల క్రితం, సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్‌కు సల్మాన్ ఖాన్‌ను సిద్ధూ మూసేవాలా ఎలా చంపామో ఆవిధంగానే సల్మాన్ ఖాన్ కూడా చంపుతామంటూ లేఖ రావడంతో కలకలం రేగింది. గోల్డీబ్రార్ ఇండియా టుడెకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే...మేం సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం. చంపడం ఖాయం. తాను క్షమించబోనని లారెన్స్ బిష్ణోయ్ ఇప్పటికే తేల్చిచెప్పాడు. మీకు క్లారిటీ ఇచ్చారు. బాబా కరుణిస్తే..ఆయన దయ ఉంటుందంటూ బ్రార్ చెప్పాడు. సల్మాన్ ఖాన్ చంపడమే తన జీవిత లక్ష్యమని జైలులో ఉన్న లారెన్్స బిష్ణోయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం సల్మాన్ ఖాన్ పై మాత్రమే కాదు..మేము బతికిఉన్నంతకాలం మా శత్రువుల అందరిపైనా దాడులు చేస్తూనే ఉంటాం. ఇప్పుడు సల్మాన్ ఖాన్ మా టార్గెట్. ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. చంపేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మేము విజయం సాధించినప్పుడు మీకు తెలుస్తుందని చెప్పాడు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి