Big breaking : తెలంగాణలో ఈ ఏడాది కరోనా తొలి మరణం..

తెలంగాణలో తొలి కరోనా మరణం కేసు నమోదైంది. హైదరాబాద్ లోని ఉస్మానియా హస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఓ వ్యక్తి చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

Corona Cases: కరోనా అలెర్ట్.. దేశంలో నాలుగు వేలు దాటినా యాక్టివ్ కేసుల సంఖ్య
New Update

తెలంగాణలో తొలి కరోనా మరణం కేసు నమోదైంది. హైదరాబాద్ లోని ఉస్మానియా హస్పిటల్ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఓ వ్యక్తి చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. చలి జ్వరంతో ఆస్పత్రికి వచ్చిన అతనికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తుండగానే కన్నుమూశాడని వైద్యులు తెలిపారు. ఇక దీనికి సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు పెరగగా పలు చోట్ల మరణాల రేటు కూడా నమోదైంది. ఇప్పటి వరకూ దేశంలో 412 యాక్టివ్ కేసులు నమోదు అవగా 4,170 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ముఖ్యంగా కేరళలో అత్యధికంగా కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతుండటంతో వైద్యాధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కి జ్వరం, దగ్గు, జలుబుతో వచ్చిన ప్రతి ఒక్కిరికీ పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇప్పటివరకూ తెలంగాణలో 455 మందికి కరోనా పాజిటీవ్ సోకిందని, హైదరాబాద్ లోనే అత్యధికంగా 55 కేసులు నమోదైనట్లు వైద్యులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి : Pakistan elections:పాక్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ యువతి సవీరా ప్రకాష్

ఈ క్రమంలోనే తీవ్ర జ్వరంతో  ఒక వ్యక్తి ఉస్మానియా ఆస్పత్రికి రాగా టెస్టులు నిర్వహించి అతనికి కోవిడ్ సోకినట్లు నిర్దారించి చికిత్స అందిస్తుండగానే మంగళవారం ఉదయం చనిపోయాడని తెలిపారు. దీంతో తెలంగాణలో తొలి కరోనా మరణం కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. అయితే ఇది కొత్త రకం జేఎన్-1 అనేదానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ సదరు వ్యక్తి ఊపిరి తిత్తుల సమస్యతో నిపోయినట్లు డాక్టర్స్ చెప్పారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో కోవిడ్ టెస్టులకు సంబంధించి టెస్ట్ సెంటర్ లను పెంచినట్లు అధికారులు తెలిపారు.  అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు జేఎన్‌.1 వేరియంట్‌ కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ సంచాలకులు రవీంద్ర నాయక్‌ తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన పడవద్దని అప్రమత్తంగా ఉండాలని రవీంద్ర నాయక్‌ సూచించారు జాగ్రత్తలు పాటిస్తేనే కరోనాను మన దరి చేరనీయకుండా తరిమి కొట్టవచ్చని అన్నారు.

#telangana #first-case #corona-death
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe