Exit Polls History: ఎగ్జిట్ పోల్స్.. ఎప్పుడు ఎలా ప్రారంభం అయ్యాయో తెలుసా?

ఎన్నికల సమరం ముగిసింది. ఫలితాల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈలోపు ఎగ్జిట్ పోల్స్ హడావుడి మొదలైంది. ఎగ్జిట్ పోల్స్ అనే విధానం మొదట అమెరికాలో 1967లో తీసుకువచ్చారు. మన దేశంలో 1996నుంచి ఎగ్జిట్ పోల్స్ ను అధికారికంగా మీడియాలో ప్రసారం చేస్తూ వస్తున్నారు. 

New Update
Exit Polls History: ఎగ్జిట్ పోల్స్.. ఎప్పుడు ఎలా ప్రారంభం అయ్యాయో తెలుసా?

Exit Polls History: రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరంలలో ఎవరి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందో తెలియజేసే దేశంలోని ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. పోలింగ్ రోజు సాయంత్రం కాగానే ప్రజల చూపు ఎగ్జిట్ పోల్ గణాంకాలపైనే ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్‌పై భారత్‌లో ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది. కానీ, ఈ ట్రెండ్ మాత్రం అమెరికా నుంచే మొదలైంది. దీని చరిత్ర 56 ఏళ్లు. అప్పుడు జరిపిన ఆ ఎగ్జిట్ పోల్ ప్రపంచంలోని అనేక దేశాలు దానిని ఆమోదించేంతగా పునాది వేసింది. ఈ ఎన్నికల ఎగ్జిట్ పోల్‌కు మూలకర్త వారెన్. ఈయన రీసెర్చ్ అండ్ సర్వేలో ప్రత్యేకత కలిగిన అమెరికన్ పొలిటికల్ పోల్‌స్టర్. ఆయన చొరవ తర్వాతే ఎన్నికల ఎగ్జిట్ పోల్‌కు ఆదరణ పెరిగింది. అక్కడ నుంచి అది ప్రపంచమంతా ట్రెండ్ గా మారింది. 

ఎగ్జిట్ పోల్ ఎప్పుడు, ఎలా మొదలైంది?

టైమ్ మ్యాగజైన్ రిపోర్ట్  ప్రకారం, అమెరికన్ పొలిటికల్ పోల్‌స్టర్ వారెన్ మొదటి - అతిపెద్ద ఎగ్జిట్ పోల్‌ను(Exit Polls History) సిద్ధం చేశాడు. అతను 1967లో మొదటిసారిగా ఎగ్జిట్ పోల్స్‌ను ప్రారంభించాడు. వారెన్ దానిని ఒక సంస్థ కోసం సిద్ధం చేశాడు. దీని తర్వాత ఇది పాప్యులర్ అయింది. అమెరికాలో అధ్యక్ష రేసు కోసం ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం ప్రారంభించింది.

చాలా వార్తా సంస్థలు దీన్ని విడుదల చేయడం ప్రారంభించాయి. 1980లో, అమెరికన్ టెలివిజన్ నెట్‌వర్క్ NBC ఓటింగ్ ముగియడానికి మూడు గంటల ముందు US అధ్యక్ష రేసులో ఉన్న రోనాల్డ్ రీగన్ -  జిమ్మీ కార్టర్ గురించి ఎగ్జిట్ పోల్‌ను విడుదల చేసింది.

1990లో, అనేక ప్రధాన అమెరికన్ వార్తా నెట్‌వర్క్‌లు, అసోసియేటెడ్ ప్రెస్ కలిసి ఓటరు న్యూస్ సర్వీస్ (VNS)గా పిలవబడే పోలింగ్ కన్సార్టియంను ఏర్పాటు చేశాయి. వివిధ సంస్థల నుంచి  వచ్చే నివేదికల ఖర్చు - వాటి తయారీని తగ్గించడం దీని ఉద్దేశ్యం.

Also Read: మధ్య ప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్..ఇక్కడ ఎవరు అధికారంలోకి వస్తారు?

వివాదంలో  VNS.. 

చాలా సంవత్సరాలు పోలింగ్(Exit Polls History) విడుదలై ప్రజాదరణ పొందిన తరువాత, కంప్యూటర్ లోపం కారణంగా దానిపై ప్రశ్నలు తలెత్తడంతో 2002లో వివాదం రేగింది. దీని తర్వాత దాన్ని క్లోజ్ చేశేసారు.  ఆ తరువాత నేషనల్ ఎలక్షన్ న్యూస్ పూల్ వివిధ సంస్థలతో ప్రారంభం అయింది. అయితే ఈ సంస్థ 2004లో ఎన్నికల రోజునే ఆన్‌లైన్‌లో డేటా లీక్ కావడంతో వివాదంలోకి చేరిపోయింది. ఇక ఆ తరువాత నుంచి వివిధ ఏజెన్సీల ఎగ్జిట్ పోల్స్ ప్రజాదరణ పొందడం ప్రారంభించాయి.

మన దేశంలో.. 

ఇక మన దేశంలో కూడా ఎగ్జిట్ పోల్స్(Exit Polls History)మొదటగా 1960లో ఢిల్లీకి చెందిన స్టడీ ఆఫ్ డెవెలపింగ్ సొసైటీస్ (CSDS) డెవలప్ చేసింది. అయితే, పూర్తిస్థాయిలో మన దేశంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం స్టార్ట్ అయింది 1980 నుంచి అని చెప్పవచ్చు. అయితే  1996లో దేశవ్యాప్తంగా CSDS ఇచ్చిన ఎగ్జిట్ పోల్‌ను ప్రభుత్వం నిర్వహించే దూరదర్శన్ ప్రారంభించినప్పటి నుంచి..  శాటిలైట్ టెలివిజన్ కూడా ఎగ్జిట్ పోల్స్ ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. 

ఎగ్జిట్ పోల్(Exit Polls History) రాష్ట్రం లేదా దేశంలో ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఎక్కువగా ఉందో చెబుతుంది. ఓటింగ్ ముగిసిన 30 నిమిషాల తర్వాత దీని ఫలితాలు విడుదల చేస్తారు. ఎగ్జిట్ పోల్స్ ఓటు వేసిన వారిని ప్రశ్నలు అడిగి వారి నుంచి వచ్చిన సమాధానాల ఆధారంగా తయారుచేస్తారు. ఇందుకోసం ఓటింగ్ రోజున సర్వే చేసే ఏజెన్సీకి చెందిన పెద్ద టీమ్ ఉంటుంది. అయితే, ఎగ్జిట్ పోల్ డేటా ఎల్లప్పుడూ ఖచ్చితమైనదిగా ఉంటుంది అని చెప్పలేం. ఒక్కసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు చాలా భిన్నంగా కూడా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.  నిన్న సాయంత్రం మన దేశంలో ఐదు రాష్ట్రాల పోలింగ్ పై ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. ప్రస్తుతం వాటి మీద రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఇక డిసెంబర్ 3న వచ్చే ఫలితాల కోసం మరింత ఆసక్తితో ప్రజలు ఎదురు చూస్తున్నారు. 

Watch this interesting Video:

Advertisment