/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/doctor.jpg)
Ananthapuram: ఆరోగ్య సమస్యలు తీర్చాల్సిన డాక్టర్.. వైద్య సిబ్బందికే తలనొప్పిగా మారాడు. తన లైంగిక కోరిక తీర్చాలంటూ వాట్సప్ లకు మెసేజ్ పంపుతూ వేధింపులకు గురిచేశాడు. ఈ దారుణ ఘటన శ్రీ సత్య సాయి జిల్లా చెన్నే కొత్తపల్లి మండలంలో చోటుచేసుకుంది.
Also Read: 9 సిమ్ కార్డుల కంటే ఎక్కువ ఉంటే.. దబిడిదిబిడే!
ప్రభుత్వ వైద్యులు డాక్టర్ ఉదయ్.. తన లైంగిక కోరిక తీర్చాలని నిత్యం వేధింపులకు దిగుతున్నట్లు నాగసముద్రం గేట్ లో పనిచేస్తున్న ఏఎన్ఎంలు వాపోయారు. పుట్టపర్తిలో బాధిత ఏఎన్ఎంలు మాట్లాడుతూ.. కోరిక తీర్చాలంటూ ప్రతిరోజు ఉదయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్లిన కూడా వాట్సప్ లకు మెసేజ్ పంపుతూ డాక్టర్ ఉదయ్ వేధింపులకు పాల్పడేవాడని ఆరోపించారు.
Also Read: Netflix Free Plan: ఇకపై ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. నెట్‌ఫ్లిక్స్ ప్లాన్.. పోలా.. అదిరిపోలా..
తన మాట వినకుంటే ఉద్యోగాల్లో ఉండలేరంటూ బెదిరింపులకు దిగుతున్నడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు ఉందని.. అలా జరగని పక్షంలో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.