AP: ఏపీలో కిలాడి కోడలు.. ఏకంగా అత్తను కిడ్నాప్ చేసి ఏం చేసిందంటే?

అన్నమయ్య జిల్లా మన్నూరులో ఆస్తి గొడవల వ్యవహారంలో అత్తను సొంత కోడలు కిడ్నాప్ చేసి నానా హింసలు పెట్టింది. తన బంధువులచే అత్త లక్ష్మి నరసమ్మను చిన్న కోడలు కిడ్నాప్ చేయించింది. ఈ క్రమంలో కోడలి నుంచి తనని రక్షించాలని అత్త పోలీసులను ఆశ్రయించింది.

New Update
AP: ఏపీలో గంజాయి మత్తులో కిడ్నాప్ కలకలం.. మూడు గంటల పాటు బట్టలు ఊడదీసి..!

Kadapa: ఆస్తి కోసం అత్తను సొంత కోడలు కిడ్నాప్ చేసి నానా హింసలు పెట్టిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. మన్నూరులో తన బంధువులచే అత్త లక్ష్మి నరసమ్మను చిన్న కోడలు కిడ్నాప్ చేయించింది. అంతేకాకుండా, కువైట్‌లో ఉన్న కొడుకుకు సీఐడీ పోలీసుల పేరిట ఫోన్ చేసి బెదిరింపులు కూడా చేయించింది. వారం రోజుల క్రితం అత్త లక్ష్మి నరసమ్మను కిడ్నాప్ చేసి రాయచోటికి తరలించి తీవ్ర చిత్రహింసలు పెట్టింది.

Also Read: అమ్మకానికి మేఘా గ్యాస్ కంపెనీ.. డీల్ కుదురుతుందా?

ఆస్తిని వారి పేరిట ఉన్న పేపర్లలో బలవంతంగా వేలి ముద్రలు వేసుకొని సెల్ ఫోన్ ను దౌర్జన్యంగా లాక్కుని కిడ్నాపర్లు వదిలి వేశారు. ఈ క్రమంలో అత్త లక్ష్మీనరసమ్మ పోలీసులను ఆశ్రయించింది. కోడలిపై చట్ట పరమైన చర్యలు తీసుకొని వారి నుంచి తనని రక్షించమని అత్త లక్ష్మి నరసమ్మ ఫిర్యాదు చేసింది. అత్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Advertisment
తాజా కథనాలు