/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/crime-.jpg)
Crime News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కారులో ఊపిరాడక చిన్నారి మృతి చెందింది. మణుగూరు మండలం సాంబాయి గూడెంలో ఈ ఘటన జరిగింది. ఆడుకుంటూ కారులో ఎక్కిన చిన్నారి ఆటోమేటిక్‌గా డోర్ లాక్ కావడంతో చిన్నారి కారులోనే ఇరుక్కుపోయింది. చిన్నారి ఎంతసేపటికి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పాప కోసం వెతకలాడారు. చివరికి కారులో చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. అయితే, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.