ఎరక్కపోయి ఇరుక్కుపోయిన చిరుత పులి..! అల్లూరి జిల్లా ఎల్లవరంలో ఎరక్కపోయి ఇరుక్కుపోయింది చిరుత పులి. కోతుల కోసం ఏర్పాటు చేసిన వలలో చిక్కుకుంది. చెట్టువద్ద వేలాడుతున్న చిరుత పులిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అటవీశాఖ అధికారులు. By Jyoshna Sappogula 30 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి Cheetah : ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల ప్రజలను పులులు, చిరుతలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఇటీవలి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరి సంచారం కలకలం రేపుతున్నాయి. చాలా చోట్ల పులులు కనిపిస్తున్నాయి. బయట దాడులు చేస్తున్నాయి. పశువులను చంపుతున్నాయి. రాత్రి అయితే చాలు కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయం భయంగా బ్రతుకుతుంటారు. Also Read: నాగార్జున సాగర్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత..ఏపీ వర్సెస్ తెలంగాణ.! తాజాగా, ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలకలం సృష్టించిన చిరుత పులిని అధికారులు వల పన్ని పట్టుకున్నారు. జిల్లాలోని అడ్డతీగల మండలం ఎల్లవరం గ్రామంలో చిరుత పులి సంచరిస్తూ ప్రజలను భయందోళనకు గురిచేసేది. దీంతో చిరుత పులి సంచరిస్తుందన్న సమాచారాన్ని అధికారులకు తెలిపారు గ్రామస్థులు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు చిరుత పులిని పట్టుకునేందుకు త్రీవ ప్రయత్నాలు చేపట్టారు. కానీ ఫలితం లేదు. Your browser does not support the video tag. Also Read: పోలింగ్ రోజున కావాలనే తెలంగాణ సెంటిమెంట్ ను లేవదీస్తున్నారు-కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే, కోతుల కోసం ఏర్పాటు చేసిన వలలో ఎరక్కపోయి ఇరుక్కుపోయింది చిరుత పులి. వలలో చిక్కి చెట్టువద్ద వేలాడుతుంది. వరి చేన్ల కోసం ఏర్పాటు చేసిన వలలో చిక్కడంతో చిరుతని చూసేందుకు జనాలు పొలాలకు తరలి వస్తున్నారు. వలలో చిక్కిన చిరుత పులిని రక్షించేందుకు అటవీశాఖ, పోలీసులు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా చిరుత వలలో చిక్కడంతో అటు స్థానిక ప్రజలు, ఇటు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి