మళ్లీ వచ్చేసింది చెడ్డీ గ్యాంగ్.. వరుసగా ఇళ్ళకు కన్నాలు..హడలెత్తిపోతున్న జనం!

Cheddi Gang: చెడ్డీ గ్యాంగ్ ఈ పేరు తలుచుకుంటేనే పోలీసులకు సైతం చెమటలు పడతాయి. అలాంటి అంతర్ రాష్ట్ర ముఠా అయిన ఈ గ్యాంగ్ మళ్ళీ తెలంగాణలో ఎంట్రీ ఇచ్చి హడలెత్తిస్తోంది. నగరశివారు ప్రాంతాలతో పాటు సంగారెడ్డి జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడి హల్ చల్ చేస్తోంది. తాళాలున్న ఇళ్లే టార్గెట్ గా రెచ్చిపోయే ఈ గ్యాంగ్ సైలెంట్ గా ఉండే కాలనీల్లో కన్నాలు వేయడం మొదలుపెట్టింది...

New Update
మళ్లీ వచ్చేసింది చెడ్డీ గ్యాంగ్.. వరుసగా ఇళ్ళకు కన్నాలు..హడలెత్తిపోతున్న జనం!

Cheddi Gang: చెడ్డీ గ్యాంగ్ ఈ పేరు తలుచుకుంటేనే పోలీసులకు సైతం చెమటలు పడతాయి. అలాంటి అంతర్ రాష్ట్ర ముఠా అయిన ఈ గ్యాంగ్ మళ్ళీ తెలంగాణలో ఎంట్రీ ఇచ్చి హడలెత్తిస్తోంది. నగరశివారు ప్రాంతాలతో పాటు సంగారెడ్డి జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడి హల్ చల్ చేస్తోంది. తాళాలున్న ఇళ్లే టార్గెట్ గా రెచ్చిపోయే ఈ గ్యాంగ్ సైలెంట్ గా ఉండే కాలనీల్లో కన్నాలు వేయడం మొదలుపెట్టింది.

చేతికి చిక్క కుండా కన్నాలు వేసే ఈ గ్యాంగ్ ఎంట్రీకి సంబంధించి సీసీ టీవీ ఫుటేజీల్లో దృశ్యాలను చూసి పోలీసులు ఖంగు తింటున్నారు. మరో వైపు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాప్స్ మాత్రం బీ అలర్ట్ అని ప్రజలను హెచ్చరిస్తున్నారు.

మియాపూర్లో విల్లాకు కన్నం..

ఇక తాజాగా చెడ్డీ గ్యాంగ్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంత విలాస్ లో హల్ చల్ చేసింది. తాళం వేసి ఉన్న విల్లాలోకి చొరబడి భారీగా బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లింది. ఇక కొంతకాలంగా రిక్కీ నిర్వహిస్తూ తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తోంది చెడ్డీ గ్యాంగ్. అయితే గత రెండు రోజుల క్రితం ఈ సంఘటన జరిగినా.. విషయం బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. విషయాన్ని గోప్యంగా ఉంచి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తూ.. చెడ్డీ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు.

రెండ్రోజుల క్రితం అమీన్ పూర్లో..

రెండ్రోజుల క్రితం చెడ్డీ గ్యాంగ్ అమీన్ పూర్ లోని పనోరమ కాలనీ లో రెచ్చి పోయింది. ఆ కాలనీలో తాళం వేసి ఉన్న మూడు ఇళ్ళకు కన్నం వేసింది. మొత్తం 11 తులాల బంగారం, 10 వేల నగదు ఎత్తుకెళ్లింది. అయితే ప్రస్తుతానికి చెడ్డీ గ్యాంగ్ సంగారెడ్డి ఇంకా నగర శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు సమాచారం. కాబట్టి అక్కడి కాలనీవాసులు అలర్ట్ గా ఉండాలని.. ఇంటికి తాళం వేసి వెళితే.. స్థానిక పోలీసు స్టేషన్లో  సమాచారం తప్పకుండా ఇవ్వాలని పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు.

జనవరిలో తెలంగాణలో హల్ చల్ చేసిన చెడ్డీ గ్యాంగ్..

జనవరిలో తెలంగాణను ఈ చెడ్డీ గ్యాంగ్ టార్గెట్ చేసింది. మహబూబ్ నగర్లో తీవ్ర భయాందోళనకు గురి చేసింది ఈ గ్యాంగ్. పలు కాలనీల్లో వరుస దొంగతనాలు చేసింది. ముఖ్యంగా తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసే చెడ్డీ గ్యాంగ్..రాత్రి పూట ఇళ్లలో చాకచక్యంగా చొరబడి డబ్బులు, నగలు దోచుకెళుతోంది. దీంతో ఇళ్లకు తాళం వేయాలంటేనే జనం జంకారు. అయితే సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజీ ఆధారంగా పోలీసులు  ఈ గ్యాంగ్ ను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.

బనియన్లు, చెడ్డీలు ధరించి..

చెడ్డీ గ్యాంగ్ ఆనవాళ్లు కనిపిస్తే చాలు ఆయా ఏరియాల్లో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఇక పోలీసులు కూడా అలర్ట్ అవుతారు. అయితే బనియన్లు, చెడ్డీలు ధరించి చేతిలో ఓ పెద్ద రాడ్ పట్టుకొని దొంగతనాలకు పాల్పడడం ఈ గ్యాంగ్ స్పెషాల్టీ. ఈ క్రమంలో ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ఆ రాడ్ తో దాడికి తెగబడతారు. విచక్షణారహితంగా కొడతారు. ఇక శివారు ప్రాంతాల్లో, నిర్మానుష్య ప్రాంతాల్లో వెలుస్తున్న కాలనీలను ఈ గ్యాంగ్ టార్గెట్ చేస్తోంది. ముందుగా డే టైమ్ లో రెక్కీ నిర్వహించి.. ఆ కాలనీలో తాళం వేసి ఉన్న ఇళ్లను ఐడెంటీ ఫై  చేస్తారు ఈ గ్యాంగ్ మెంబర్స్.. ఇక చీకటి పడగానే ఎటాక్ చేస్తారు. బంగారం, నగదు మాత్రమే దొంగలిస్తారు. చడిచప్పుడు కాకుండా ఇంటి తాళాలు బద్దలు కొట్టడం.. కిటికీల్లోంచి లోపలికి దూరడంలో వీరికి వెన్నతో పెట్టిన విద్య.

Also Read: దిశ తరహాలోనే మహిళను తగలబెట్టిన దుండగుడు!

Advertisment
Advertisment
తాజా కథనాలు