శంషాబాద్ లో దారుణం.. దిశ తరహాలోనే మహిళను తగలబెట్టిన దుండగుడు! శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ గుర్తుతెలియని మహిళను అర్థరాత్రి హత్య చేసి..పెట్రోల్ పోసి తగలబెట్టారు దుర్మార్గులు. కాగా, సైబరాబాద్ జోన్ డీసీపీ ఆఫీస్ కు కూతవేటు దూరంలో ఆ దారుణం చోటుచేసుకోవడం తీవ్ర సంచలనాన్ని రేకెత్తిస్తోంది. By P. Sonika Chandra 11 Aug 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ గుర్తుతెలియని మహిళను అర్థరాత్రి హత్య చేసి..పెట్రోల్ పోసి తగలబెట్టారు దుర్మార్గులు. కాగా, సైబరాబాద్ జోన్ డీసీపీ ఆఫీస్ కు కూతవేటు దూరంలో ఆ దారుణం చోటుచేసుకోవడం తీవ్ర సంచలనాన్ని రేకెత్తిస్తోంది. అర్థరాత్రి అయినా కాని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కారణంగా నిఘా గట్టిగానే ఉంటుంది. ఎప్పుడూ పోలీసు బండ్ల హారన్ల సౌండ్ మోగుతూనే ఉంటుంది. కాలనీలో చుట్టూ అన్నీ ఇళ్లు ఉన్నాయి.. పక్క నుంచే మెయిన్ రోడ్ పోతుంది.. అయినా కాని దుండగులు మహిళను అత్యంత దారుణంగా హతమార్చి అక్కడే పెట్రోల్ పోసి తగలబెట్టడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇక డీటైల్స్ లోకి వెళితే..ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్ ఎన్ క్లేవ్ కాలనీ ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని మహిళ పై అర్థరాత్రి ఒంటి గంట సమయంలో పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే డయల్ 100 కు కాల్ చేశారు. దీంతో హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ మహిళ పూర్తిగా కాలి బూడదైంది. కాగా, ఓ వ్యక్తి బైక్ పై వచ్చి ఆమె తగలబెట్టినట్టు ఆనవాళ్లను ప్రాథమికంగా పోలీసులు సేకరించారు. నిందితుల కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. అదే విధంగా ఆధారాలను సేకరిస్తూ.. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే ఎవరో చెత్తను తగలబెడుతున్నారని అనుకున్నామే కాని.. ఇలా మహిళను జనావాసాల మధ్య తగలబెడతారని అనుకోలేదని స్థానికులు షాక్ లో ఉన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి