Highest Majority: ఏపీ ఎన్నికల్లో భారీ మెజార్టీల వీరులు వీరే! ఏపీ ఎన్నికల్లో కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. కూటమి తరఫున పోటీచేసిన వారిలో చాలామంది అత్యధిక మెజార్టీలు సాధించారు. ఏభైవేలకంటే ఎక్కువ మెజార్టీ సాధించిన కూటమి అభ్యర్థుల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 05 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Highest Majority: ఏపీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించింది టీడీపీ కూటమి. విస్పష్టంగా ఏపీ ఓటరు అధికార వైసీపీని తిరస్కరించాడు. పథకాల పేరుతో ప్రజలకు విచ్చలవిడిగా డబ్బు పంపకాలు చేసి.. ఆ వర్గం ఓట్లపై ఆశలు పెట్టుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తీవ్ర నిరాశను మిగిల్చాయి ఈ ఎన్నికలు. కష్టం మీద 11 సీట్లు గెలిచింది వైసీపీ. మరోవైపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా జట్టుకట్టి చరిత్రలో లేని విధంగా భారీ విజయాన్ని సాధించాయి. ఏకంగా 164 సీట్లను తమ ఖాతాలో వేసుకుని ప్రతిపక్షం అనేదే లేకుండా అధికారాన్ని కైవసం చేసుకుంది కూటమి. Also Read: కొత్త ప్రభుత్వం వస్తుంటే.. సెలవులోకి సీఐడీ సంజయ్ Highest Majority: ఈ ఎన్నికల్లో జనం కూటమికి ఓట్ల వర్షం కురిపించారు. కూటమిలోని చాలామంది అభ్యర్థులు భారీ మెజార్టీలు సాధించారు. ఎవరూ ఊహించని విధంగా మెజార్టీలతో ఎన్నికల్లో గెలిచారు అభ్యర్థులు. భారీ మెజార్టీ సాధించిన వారు.. అలా భారీ మెజార్టీలతో గెలిచిన వారి వివరాలు ఇక్కడ చూద్దాం. గాజువాక - పల్లా శ్రీనివాసరావు (టీడీపీ) 95, 235 ఓట్లు భీమిలి - గంటా శ్రీనివాసరావు (టీడీపీ) 92, 401 ఓట్లు మంగళగిరి - నారా లోకేశ్(టీడీపీ) 91, 413 ఓట్లు పెందుర్తి - పంచకర్ల రమేశ్ (జనసేన) 81, 870 ఓట్లు నెల్లూరు అర్బన్ - నారాయణ (టీడీపీ) 72,489 ఓట్లు తణుకు- రాధాకృష్ణ (టీడీపీ) 72,121 ఓట్లు కాకినాడ రూరల్ - పంతం నానాజీ (జనసేన) 72,040 ఓట్లు రాజమండ్రి అర్బన్ - శ్రీనివాస్ (టీడీపీ) 71,404 ఓట్లు పిఠాపురం -పవన్ కల్యాణ్ 70, 279 ఓట్లు వీరు రికార్డు మెజార్టీలు సాధించి తమకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఇంకా ఓట్ల శాతాల వివరాలు పూర్తిగా అందాల్సి ఉంది. #2024-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి