/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/miss-fire.jpg)
Miss Fire:ఆర్మీ ఫైరింగ్ రేంజ్ నుంచి బుల్లెట్ బయటకు దూసుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా గంధంగూడలోని ఇంట్లోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఇంట్లో ఉన్న మహిళ కాలుకు బుల్లెట్ తగిలింది. జవాన్లు ఫైరింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. బుల్లెట్ తగలడంతో ఒక్కసారిగా మహిళ కుప్పకూలింది. గాయపడిన మహిళను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలం వద్దకు నార్సింగి పోలీసులు చేరుకున్నారు. ఈనెలలోనే ఆర్మీ ఫైరింగ్ రేంజ్ నుంచి బుల్లెట్ బయట ప్రాంతాలకు దూసుకురావడం ఇది రెండోసారి.