ప్రముఖ బడ్జెట్ స్మార్ట్‌వాచ్ తయారీ సంస్థ బౌల్ట్ బౌల్ట్ క్రౌన్ స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది . యాపిల్ వాచ్ అల్ట్రా తరహా డిజైన్‌తో బోల్ట్ క్రౌన్ స్మార్ట్‌వాచ్ భారతదేశంలో విడుదలైంది. స్మార్ట్‌వాచ్ 1.95-అంగుళాల HD డిస్ప్లేను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 900 నిట్ల వరకు బ్రైట్నెస్కు సపోర్టునిస్తుంది. స్మార్ట్ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్, స్మార్ట్ హెల్త్ ట్రాకర్ వంటి హార్ట్ రేట్ సెన్సార్, బ్లడ్ ప్రెజర్ మానిటర్, SpO2 సెన్సార్, స్లీప్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. స్మార్ట్‌వాచ్‌లో జింక్-అల్లాయ్ మెటాలిక్ ఫ్రేమ్, తిరిగే క్రౌన్ బటన్ ఉన్నాయి.
పూర్తిగా చదవండి..ఇది యాపిల్ వాచ్‌కి కజిన్, కేవలం రూ. 1499ఏ ..ఓ లుక్కెయ్యండి..!!
తాజాగా ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారుదారీ సంస్థ బౌల్ట్ సరికొత్త స్మార్ట్ వాచ్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. బౌల్ట్ క్రౌన్ స్మార్ట్‌వాచ్ ...అచ్చం యాపిల్ వాచ్ అల్ట్రా మాదిరి డిజైన్‌తోనే భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ వాచ్ అధికారిక బోల్ట్ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ వాచ్ బ్లాక్ ఆరెంజ్ ఎల్లో, బ్లూ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Translate this News: