Hyderabad: అలా సరదాగా కశ్మీర్ కు వెళ్లి కనువిందు చేస్తున్న మంచు కొండల అందాలను చూసి ఎంజాయ్ చేయానుకుంటున్నారా? కానీ అక్కడకు వెళ్లే సమయం, డబ్బులు ఎక్కువగా ఖర్చువతుందని ఆలోచిస్తున్నారా? కశ్మీర్ తలపించే అందాలు మన హైదరబాద్ లోనే ఉన్నాయి. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం కొండాపూర్ లోని మంచు సోయగంతో అల్లుకున్న "స్నో కింగ్‌డమ్" అతిశీతలమైన మాయాజాలాన్ని అతి తక్కువ బడ్జెట్ తో మీరు థ్రిల్ చేసేయండి. భారతదేశంలోని అతిపెద్ద స్నో థీమ్ ఇండోర్ వినోద కేంద్రం, చెన్నై, ముంబై నగరాలతో పాటు "శరత్ సిటీ క్యాపిటల్ మాల్, కొండాపూర్ లో అలరిస్తోంది.
"స్నో కింగ్‌డమ్" ప్రత్యేకతలు:
మంచు ప్యాలెస్‌లు, మంచుతో కప్పబడిన పర్వతాలు, నల్ల సీల్స్‌తో కూడిన ఓక్ చెట్లు, ధ్రువ ఎలుగుబంట్లు, నిలబడి ఉన్న పెంగ్విన్‌లు, ఇగ్లూలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. 32,000 చదరపు అడుగుల విశాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులో పర్యాటకులు ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయొచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవాన్ని, మంచును అనుభవించేలా "స్నో మచ్ ఫన్", "ఇది మీ చేతుల్లో ఉంది" అనే పేటెంట్ క్యాచ్‌ఫ్రేజ్‌లతో, స్నో కింగ్‌డమ్ తన సందేశాన్ని పర్యాటకులకు తెలియజేస్తుంది.
Also Read: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సజ్జనార్ కీలక ప్రకటన
పెద్దలకు రూ. 650, పిల్లలకు రూ. 600 టెకెట్ ధర చెల్లించి 45 నిమిషాలు.. మంచులో ఆడుకోవడం, హిమపాతం యొక్క ఆనందాన్ని అనుభవించడం, టోబోగానింగ్, స్నో స్లెడ్డింగ్, స్నో రాక్ క్లైమింగ్, స్నో డ్యాన్స్ ఫ్లోర్‌లో డ్యాన్స్ చేయడం వంటి కార్యక్రమాలలో పాల్గొనాల్గవచ్చు. స్నో కింగ్‌డమ్ రోజుకు 10 సెషన్‌లను, సంవత్సరంలో 365 రోజులు నిర్వహిస్తుంది. స్నో కింగ్‌డమ్ వినోదంలో భాగంగా CSR కార్యక్రమాలలో వెనుకబడిన పిల్లలు, విద్యార్థులకు -8 డిగ్రీల వద్ద మంచును అనుభవించే అవకాశాన్ని కూడా సృష్టిస్తోంది. తద్వారా సమాజంలో మానవ విలువలు, సంప్రదాయాన్ని, కరుణను తిరిగి ఇవ్వడానికి.. పెంపొందించడానికి సంస్థ యొక్క అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది.