మమతా బెనర్జీ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ ప్రభుత్వం!

బంగ్లాదేశ్‌లో హింసాత్మక పరిస్థితులు తలెత్తిన వేళ.. బాధితులకు ఆశ్రయం కల్పిస్తామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.దీని పై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ భారత హై కమిషన్ వద్ద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

మమతా బెనర్జీ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ ప్రభుత్వం!
New Update

బంగ్లాదేశ్‌లో హింసాత్మక పరిస్థితులు తలెత్తిన వేళ బాధితులకు ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం లేపుతున్నాయి.ఈ వ్యాఖ్యల పై బంగ్లాదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.మమతా వ్యాఖ్యలు ఉగ్రవాదులకు ప్రయోజనం చేకూరేలా ఉన్నాయని బంగ్లా విదేశాంగ వ్యాఖ్యనించింది. ఈ మేరకు భారత్ కమిషన్ కు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ  భారత రాయబార కార్యాలయం వద్ద తీవ్ర అభ్యంతకరం వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

బంగ్లాదేశ్ గతంలో తూర్పు పాకిస్తాన్లో అంతర్భాగమైనది. తూర్పు పాకిస్తాన్‌లోని బెంగాలీ మాట్లాడే ప్రజలపై పాకిస్తాన్ సైన్యం జాతి అణచివేతను ప్రారంభించింది. ఈ ఘటనలో పదివేల మంది బంగ్లాదేశ్ ప్రజలను పాక్ సైనికులు ఊచకోత కోశారు. దీని తర్వాత 1971లో భారత్ సహాయంతో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించింది.

బంగ్లాదేశ్ స్వాతంత్ర యుద్ధంలో పాల్గొన్న సైనికుల కుటుంబాలకు విద్య ఉద్యోగాలలో 30% రిజర్వేషన్లను అప్పటి ప్రభుత్వం ఇస్తున్నట్లు ప్రకటించింది. కొన్నాళ్ల తర్వాత ఈ రిజర్వేషన్‌ను రద్దు చేశారు. అయితే కోర్టు జోక్యంతో ఈ 30% రిజర్వేషన్ మళ్లీ అందుబాటులోకి వచ్చింది. అయితే మళ్లీ 30 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ విద్యార్థులు నిరసనకు దిగారు. దీంతో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హింసాకాండలో వంద మందికి పైగా చనిపోయారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం హింసాత్మక ఘర్షణలకు తెగపడే వారిని కాల్చివేయాలని ఆదేశించింది.

ఈ స్థితిలో కోల్‌కతాలో అధికార తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించిన అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో హింసాకాండలో నష్టపోయిన ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నేను బంగ్లాదేశ్ సమస్య గురించి మాట్లాడటం లేదు.దీనిపై మాట్లాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఉంది. కానీ బంగ్లాదేశ్ బాధితులు పశ్చిమ బెంగాల్ తలుపులు తట్టినప్పుడు మేము వారికి ఆశ్రయం కల్పిస్తాము. సహాయం కోరుతున్న శరణార్థులకు తగిన గౌరవం లభించేలా చూసుకుంటామని దీదీ హామీ ఇచ్చింది.

మమత ప్రసంగం బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేలా ఉందని భారత్ హైకమీషన్ తో బంగ్లా విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతకరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు, సంఘవిద్రోహులకు ప్రయోజనం చేకూరేలా మమతా బెనర్జీ వ్యాఖ్యలు ఉన్నాయని వారు తెలిపినట్టు జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

#mamata-banerjee
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe