Ap: ఆ అధికారులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

ఏపీకి డెప్యూటేషన్‌ పై వచ్చిన అధికారుల గురించి ఏపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటేషనుపై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వ నిర్ణయించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో డిప్యుటేషన్ పై వచ్చిన అధికారులపై కీలక ఆదేశాలు జారీ చేసింది..

New Update
Ap Govt: వాలంటీర్ల వ్యవస్థ పై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం!

Ap: ఏపీకి డెప్యూటేషన్‌ పై వచ్చిన అధికారుల గురించి ఏపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటేషనుపై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వ నిర్ణయించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో డిప్యుటేషన్ పై వచ్చిన అధికారులపై కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా.. తమను రిలీవ్ చేయాలంటూ డెప్యుటేషన్ పై వచ్చిన పలువురు అధికారులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో.. ఏపీ నుంచి రిలీవ్ చేయాల్సిందిగా గనుల శాఖ ఎండీ వీజీ వెంకటరెడ్డి సీఎస్ కు దరఖాస్తు చేశారు.

అంతేకాకుండా.. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి కూడా.. తనను వెంటనే బాధ్యతల నుంచి రీలీవ్ చేయాల్సిందిగా విన్నవించారు. మరోవైపు.. తన మాతృ శాఖకు రిలీవ్ చేయాల్సిందిగా ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి సీఎస్ ను వేడుకున్నారు. వీరితో పాటు.. ఏపీ నుంచి రీలీవ్ చేయాల్సిందిగా దరఖాస్తులు చేసుకున్న వారిలో ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూధన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ చిలకల రాజేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు.

గతంలో డెప్యూటేషనుపై వచ్చిన అధికారులపై టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఈ క్రమంలో.. వారు రిలీవ్ చేయాల్సిందిగా సీఎస్ ను అడుగుతున్నారు. కాగా.. తెలంగాణకు వెళ్లేందుకు ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే. రావత్ తో పాటు తెలంగాణకు వెళ్లేందుకు మరికొందరు కీలక శాఖల అధికారులు కూడా దరఖాస్తులు చేసుకున్నారు. అయితే.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఉన్నతాధికారులకెవరికీ సెలవులివ్వొద్దని నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో.. ఇప్పటికే తన సెలవు ప్రతిపాదనను సీఐడీ చీఫ్ సంజయ్ వెనక్కు తీసుకున్నారు.

Also read: రాయ్‌ బరేలీ…వయనాడ్‌ రెండింటిలో ఏదంటే!

Advertisment
తాజా కథనాలు