E-Shram: ప్రస్తుతం దేశంలో అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు కోట్లాది మంది ఉన్నారు. ఉద్యోగ భద్రత అంటూ ఎక్కడా లేదు. ఈ రోజు మీకు ఉద్యోగం ఉండవచ్చు. రేపు మీరు నిరుద్యోగులు అవుతారు. అలాంటి వారికి సహాయం చేయడానికి, కార్మిక- ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా ఒక పథకం ప్రారంభించారు. దాని పేరు ఈ-శ్రమ్ యోజన. ఇటీవల, ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్ట్ లో అసంఘటిత రంగ కార్మికుల జాతీయ డేటాబేస్ పోర్టల్ అయిన ఈ-శ్రమ్ మూడేళ్ల కాలంలో 30 కోట్ల రిజిస్ట్రేషన్ల లక్ష్యాన్ని అధిగమించిందని పేర్కొంది. ఈ పథకం ద్వారా మీరు రూ.2 లక్షల బీమా కవరేజీని ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.
మీరు రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ కవర్ పొందుతారు
E-Shram: మీరు ఇ-శ్రమ్ యోజన కింద రిజిస్టర్ చేసుకుంటే, ప్రభుత్వం మీకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఆర్థిక సహాయంతో పాటు, ఈ పథకం కింద, రూ. 2 లక్షల ప్రమాద బీమా ప్రయోజనం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దేశంలోని చిరువ్యాపారులు, కూరగాయలు అమ్మేవారు, ఇంటి పనివారు, అలాగే చిన్న చిన్న ఉద్యోగాలు చేసే యువత వంటి దేశంలోని కార్మికులందరూ ఇ-శ్రమ్ కార్డ్ స్కీమ్ ప్రయోజనాలను పొందవచ్చు. ఎవరైనా పన్ను చెల్లిస్తే లేదా వ్యాపారవేత్త అయితే, అతనికి ఈ ప్రయోజనం ఉండదు.
ఈ ప్రయోజనాలను పొందవచ్చు
ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న కొన్ని రోజుల తర్వాత, కార్మికుల కార్డు ఇస్తారు. ఈ పోర్టల్ కింద దేశంలోని కార్మికులందరినీ ఒకే ప్లాట్‌ఫారమ్‌పై అనుసంధానం చేస్తున్నారు. ఈ కారణంగా, భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఏదైనా పథకాన్ని ప్రారంభిస్తే, ఈ పోర్టల్ సహాయంతో నమోదిత కార్మికులకు ప్రయోజనాలను అందిస్తుంది. ప్రస్తుతం ఇందులో నమోదు చేసుకున్న వారికి రూ.2 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నారు.
ఇలా అప్లై చేసుకోవాలి..
E-Shram: ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి, కొన్ని అవసరమైన పత్రాలు ఉండాలి. దరఖాస్తుదారు ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్‌బుక్ వంటి పత్రాలను కలిగి ఉండాలి. ఇ-శ్రమ్ కార్డ్ పొందడానికి, మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని కోసం మీరు మొదట ఇ-శ్రమ్ పోర్టల్‌కి వెళ్లి రిజిస్టర్ ఆన్ ఇ-ష్రామ్ ఎంపికపై క్లిక్ చేయండి. దీని తర్వాత ఇప్పుడు మీ మొబైల్ నంబర్, OTPని నమోదు చేయాలి. దీని తర్వాత e-shram కార్డ్ ఫారమ్‌ను పూరించండి దానిని సబ్మిట్ చేయండి. దీని తర్వాత మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. దీని తర్వాత మీరు మీ ఇ-శ్రమ్ కార్డును ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిని జాగ్రత్తగా దగ్గర ఉంచుకోవచ్చు.