Khairatabad Vinayaka: ఖైరతాబాద్ వినాయకుడు రెడీ అవుతున్నాడు.. ఈసారి ఎత్తులో మరో రికార్డ్!

ఖైరతాబాద్ వినాయకుడికి దేశవ్యాప్తంగా క్రేజ్. భారీగా కొలువుతీరే ఈ గణపయ్యను చూడటానికి భక్తులు పోటెత్తుతారు. ఈ ఏడాదితో ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలకు 70 ఏళ్ళు. అందుకే ఈసారి 70 అడుగుల అతి భారీ వినాయకుడ్ని సిద్ధం చేస్తున్నారు. దీనికోసం జరిపే కర్రపూజను సోమవారం నిర్వహించారు. 

New Update
Khairatabad Vinayaka: ఖైరతాబాద్ వినాయకుడు రెడీ అవుతున్నాడు.. ఈసారి ఎత్తులో మరో రికార్డ్!

Khairatabad Vinayaka: ఖైరతాబాద్ వినాయకుడు అంటే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తి. ప్రతి వినాయక చవితికి ఇక్కడ ఏర్పాటు చేసే భారీ గణనాధుడ్ని దర్శించుకోవడానికి లక్షలాది ప్రజలు తరలి వస్తారు. దేశంలోనే ఎత్తైన విగ్రహాన్ని ఖైరతాబాద్ లో ప్రతియేటా ఏర్పాటు చేస్తారు. విగ్రహం తయారీ.. ప్రతిష్టాపన.. పూజలు.. నిమజ్జనం ఇలా ప్రతి అంశంలోనూ ఖైరతాబాద్ వినాయకుని ప్రత్యేకతలు వేరుగా ఉంటాయి. వినాయకుని విగ్రహాన్ని చేసే ముందు ప్రతి సంవత్సరం కర్ర పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కర్నపూజ జరిగిన తరువాత విగ్రహ తయారీ పనులు మొదలవుతాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయకచవితి వస్తోంది. ఖైరతాబాద్ వినాయకుడిని తయారు చేయడం కోసం సోమవారం కర్నపూజ నిర్వహించారు. అంటే, భారీ గణనాధుని విగ్రహ తర్యారీ కోసం పనులు ఇప్పుడు ప్రారంభం అయ్యాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కర్రపూజ వేడుకలో పాల్గొన్నారు. 

Khairatabad Vinayaka: కర్రపూజ పూర్తయిన అనంతరం ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్‌లో పర్యావరణ హితమైన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సంప్రదాయం ప్రకారం  కర్రపూజ నిర్వహించి విగ్రహాన్ని తయారు చేయడం ప్రారంభించినట్టు వెల్లడించారు.  గతంలో కంటే మెరుగ్గా ఉత్సవాలను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. అందుకు అనుగుణంగా అన్ని విభాగాలను సిద్ధం చేస్తున్నామని దానం నాగేందర్ తెలిపారు. వినాయకుని ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం కోసం మరో రెండు, మూడు రోజుల్లో ఉత్సవ కమిటీలతో సమావేశం కానున్నట్లు వెల్లడించారు. గణేశుని దర్షించుకోవడానికి  వచ్చే ప్రతి భక్తునికి ప్రసాదం అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తామని దానం నాగేందర్ తెలిపారు.

Khairatabad Vinayaka: ఏడాది ఖైరతాబాద్ గణపతికి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి 70 అడుగుల మట్టి గణపతిని ప్రతిష్ఠించాలని నిర్వాహకులు నిర్ణయించినట్లు ఎమ్మెల్యే  తెలిపారు. 45 నుంచి 50 టన్నుల బరువున్న ఖైరతాబాద్ వినాయకుడిని గతేడాది 63 అడుగుల ఎత్తులో ఇక్కడ ప్రతిష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 70 అడుగుల పూర్తి మట్టి విగ్రహంగా ఈసారి ఖైరతాబాద్స వినాయకుని విగ్రహం సరికొత్త రికార్డు సృష్టించనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు