/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-96.jpg)
Amaravathi: ‘తల్లికి వందనం’ పథకంపై ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఆ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఇంకా ఖరారు చేయలేదని స్పష్టం చేసింది. ఈ పథకం కింద రూ.15వేలు రావాలంటే ఇలా చేయాలంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించింది. ఈ పథకం విధివిధానాలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన తర్వాతే దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది.