Notification: గురుకులల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల! తెలంగాణలోని మహాత్మ జ్యోతి బాపు లే సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ను ఆర్‌డీసీ సెట్- 2024 ను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. By Bhavana 25 Mar 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలోని మహాత్మ జ్యోతి బాపు లే సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ను ఆర్‌డీసీ సెట్- 2024 ను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రవేశాలకు అర్హులైన వారంతా కూడా ఏప్రిల్ 12 లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు ఏప్రిల్ 21 నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://tswreis.ac.in/ వెబ్‌సైట్ చూడొచ్చు. అలాగే.. డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేయండి.ఈ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు సమాధానాలు పెట్టాల్సి ఉంటుంది. ఇంటర్ సిలబస్ ఆధారంగానే ప్రశ్నాపత్రం ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ప్రశ్నాపత్రం ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉండవు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఎలాంటి ఫీజులు ఉండవు. పూర్తి ఉచితంగా విద్యా, వసతి అందిస్తారు. ముఖ్య సమాచారం : అర్హత: కనీసం 50శాతం మార్కులతో 2024 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా కేటాయిస్తారు. Also read: వందేళ్ల తర్వాత హోలీ నాడు చంద్రగ్రహణం..! #telangana #notification మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి