TG Politics: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ!

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి తన అనుచరుడు, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడితో కలిసి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. రేపు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వీరి చేరిక ఉండే అవకాశం ఉంది.

New Update
TG Politics: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ!

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. 2023 ఎన్నికల్లో అలంపూర్, గద్వాల్ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అయితే.. ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ను వీడి.. కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఇప్పుడు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సైతం పార్టీని వీడడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో అలంపూర్ టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు బీఆర్ఎస్ కేటాయించింది.

అయితే.. ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి చక్రం తిప్పి.. ఆఖరి నిమిషంలో టికెట్ మార్పించారు. తన అనుచరుడు విజయుడికి టికెట్ ఇప్పించారు. అనంతరం రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచినా.. అలంపూర్ లో మాత్రం తన అనుచరికి విజయం దక్కేలా చక్రం తిప్పారు వెంకట్రామిరెడ్డి. తాజాగా వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఆయనతో పాటు ఎమ్మెల్యే విజేయుడు సైతం కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో MLC చల్లా వెంకట్రామిరెడ్డి భేటీ అయినట్లు సమాచారం. రేపు రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భారీగా చేరికలు జరగనున్నట్లు తెలుస్తోంది. విజయుడి చేరికతో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య సున్నాకు చేరుతుంది.

Advertisment
తాజా కథనాలు