TS DEECET: టీజీ డీఈఈ సెట్‌ ఫలితాలు విడుదల...ఎంతమంది ఉత్తీర్ణులు అయ్యారంటే!

రాష్ట్రంలో డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌, డిప్లొమో ఇన్‌ ప్రి స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీలలో సీట్ల భర్తీ కోసం ఈ నెల 10న నిర్వహించిన డీఈఈసెట్‌-2024 పరీక్ష ఫలితాలను సెట్‌ కన్వీనర్‌ బుధవారం విడుదల చేశారు. 71.53 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు కన్వీనర్‌ వివరించారు.

New Update
TS DEECET: టీజీ డీఈఈ సెట్‌ ఫలితాలు విడుదల...ఎంతమంది ఉత్తీర్ణులు అయ్యారంటే!

TS DEECET 2024 Results : రాష్ట్రంలో డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌, డిప్లొమో ఇన్‌ ప్రి స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీలలో సీట్ల భర్తీ కోసం ఈ నెల 10న నిర్వహించిన డీఈఈసెట్‌-2024 పరీక్ష ఫలితాలను సెట్‌ కన్వీనర్‌ బుధవారం విడుదల చేశారు. ఈ ఫ‌లితాలు జులై 25వ తేదీ నుంచి సంబంధిత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు వివరించారు. ఈ ఫలితాలలో తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ మీడియాలతో కలిపి మొత్తం 71.53 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు కన్వీనర్‌ వివరించారు.

ఇందులో తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ మీడియాలలో మొత్తం డీఈఈసెట్‌ కోసం 17,595 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా 15,150 మంది పరీక్షలకు హాజరై రాశారు. వారిలో 12,032 మంది అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించినట్లు అధికారులు వివరించారు. మొత్తం పరీక్షలు రాసిన వారిలో తెలుగు మీడియంలో 6,644 మంది, ఇంగ్లీష్‌లో 5,024 మంది, ఉర్దూలో 364 మంది అభ్యర్థులున్నారు.

డీఈఈసెట్‌ ఫలితాలకు సంబంధించిన మార్కులు/ ర్యాంకు కార్డులు https://deecet.cdse.telangana.gov.in అనే వెబ్‌సైట్‌లో జులై 25వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయ‌ని కన్వీనర్‌ వివరించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ, వెబ్‌ ఆప్షన్ల నమోదు, సీట్లు కేటాయింపు వంటి తేదీలు త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.

Also Read: భారత్‌ లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు…తమ పౌరులకు అమెరికా హెచ్చరికలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు