Rahul Dravid: టెస్ట్ ఛాంపియన్ షిప్ ను కూడా కోహ్లీ సాధించాలి..ద్రవిడ్!

టీ20, వన్డే ప్రపంచకప్‌ గెలవటంలో ముఖ్యపాత్ర పోషించిన కోహ్లీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ సత్తా చాటి ట్రోఫీ సాధించాలని ద్రవిడ్ ఆకాంక్షించాడు.టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం డ్రెస్సింగ్ రూంలో జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరలవుతోంది.

Rahul Dravid: టెస్ట్ ఛాంపియన్ షిప్ ను కూడా కోహ్లీ సాధించాలి..ద్రవిడ్!
New Update

Virat Kohli: భారత జట్టు ఆటగాడు కోహ్లీ.. 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ ('మినీ' ప్రపంచకప్)  ఇప్పుడు 2024లో 'టి20' ప్రపంచకప్ వంటి మూడు ప్రధాన సిరీస్‌లలో ట్రోఫీలు గెలిచినసభ్యుడుగా ఉన్నాడు. అయితే తాజాగా టీమిండియా కోచ్ ద్రవిడ్ (Rahul Dravid) టెస్టు ఛాంపియన్‌షిప్ గెలిచే జట్టులో  కూడా కోహ్లీ ఉండాలని కోరాడు.

వరల్డ్ కప్ విజేత భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు చేసుకుంది. కోహ్లీని చూస్తూ ద్రవిడ్ ఇలా అన్నాడు, 'కోహ్లీ వైట్ బాల్ లో మూడు ఐసిసి కప్ లను అందుకున్నాడు. ఇక మిగిలింది రెడ్ బాల్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మాత్రమే. ఇందులోనూ కోహ్లీ రాణించి కప్ గెలవాలి' అని ద్రవిడ్ అన్నాడు.ఈ వీడియోను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తన వెబ్‌సైట్‌లో షేర్ చేసింది.

Also Read: RCB కొత్త బ్యాటింగ్ కోచ్‌గా తమిళనాడు ఆటగాడు..!

#dravid #kohli
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe