Terrorist Attack : ఉగ్రవాదుల బీభత్సం.. చర్చిలపై దాడులు.. 18 మందికి పైగా మృతి!

రష్యాలో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. యూదుల ప్రార్థనా స్థలం, చర్చిపై దాడులకు తెగబడ్డారు. తుపాకీలతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 18 మందికి పైగా మృతి చెందినట్టు ప్రాధమికంగా నిర్ధారించారు. చర్చి ఫాదర్ కూడా ఇందులో ఉన్నారు. 

New Update
Terrorist Attack : ఉగ్రవాదుల బీభత్సం.. చర్చిలపై దాడులు.. 18 మందికి పైగా మృతి!

Terrorist Attack On Church : రష్యా (Russia) లోని యూదుల ప్రార్థనా స్థలం, చర్చిపై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 17 మంది పోలీసులు, ఒక ఫాదర్ సహా పలువురు మరణించగా, 25 మందికి పైగా గాయపడ్డారు. ఉగ్రవాదులు పూజారి గొంతు కోసినట్లు సమాచారం. దీనికి ప్రతీకారంగా రష్యా భద్రతా బలగాలు ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. రష్యాలోని డాగేస్తాన్‌లో ఇప్పటికీ సైనిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. డాగేస్తాన్ ప్రావిన్స్‌లోని రెండు నగరాల్లో ఈ ఉగ్రదాడి జరిగింది.

Terrorist Attack : ఈ దాడితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రష్యా రోడ్లపై ట్యాంకులు, ప్రత్యేక బలగాలు మోహరించారు. గత 9 గంటలుగా ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఉగ్రదాడిలో మరణించిన వారిలో ఏడుగురు అధికారులు, ఒక ఫాదర్, చర్చి సెక్యూరిటీ గార్డు ఉన్నారు. డాగేస్తాన్, డెర్బెంట్, మఖచ్కల అనే రెండు నగరాల్లో జరిగిన ఈ ఉగ్రవాద దాడి తరువాత, సోమ, మంగళ, బుధవారాలను సంతాప దినాలుగా ప్రకటించారు.

రెండు ఆర్థోడాక్స్ చర్చిలపై ఏకకాలంలో..
రెండు ఆర్థోడాక్స్ చర్చిలపై ఉగ్రవాదులు ఏకకాలంలో దాడి చేశారు. సాయంత్రం ప్రార్థనల అనంతరం ఉగ్రవాదులు చర్చి (Church) లోకి ప్రవేశించారు. ఉగ్రవాదులు ఆటోమేటిక్ ఆయుధాలతో చర్చిలో విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు సమాచారం. ఉగ్రవాదులు 66 ఏళ్ల ఫాదర్ ను  గొంతు కోసి హత్య చేశారు. ఫాదర్ నికోలాయ్ గత 40 సంవత్సరాలుగా చర్చిలో సేవ చేస్తున్నాడు. యూదుల ప్రార్థనా మందిరంపై కూడా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

రంగంలోకి రష్యా కమాండోలు..
Terrorist Attack మఖచ్కలాలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఈ దాడి తర్వాత రష్యా కమాండోలు రంగంలోకి దిగారు. మీడియా కథనాల ప్రకారం, చర్చిపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అయితే ఈ ఉగ్రదాడికి ఇప్పటి వరకు ఏ సంస్థ బాధ్యత వహించలేదు. దాడి తరువాత, రష్యా  సైన్యం మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. నగరం నుండి అన్ని రహదారులు మూసివేశారు. 

ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడు
దాడి తర్వాత, డాగేస్తాన్‌లో ఒక ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. ఆత్మాహుతి దాడి చేసిన వ్యక్తి కారులో కూర్చున్నట్లు సమాచారం. ఒక్కసారిగా కారు పేలిపోయింది.నిపుణులు చెబుతున్నదాని ప్రకారం  డాగేస్తాన్‌లో ఉగ్రవాద ఆపరేషన్ జరిగిన తీరు,  స్థాయి, డాగేస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలకు ఎక్కడో బయట నుండి కొంత మద్దతు లభించినట్లు అనిపిస్తుంది.

డెర్బెంట్, డాగేస్తాన్‌లోని రెండవ అతి ముఖ్యమైన నగరం
రష్యాలో దాడికి గురైన యూదుల ప్రార్థనా స్థలం, చర్చి రెండూ డాగేస్తాన్‌లోని డెర్బెంట్ నగరంలో ఉన్నాయి. డెర్బెంట్ అనేది దక్షిణ కాకసస్‌లోని ముస్లింల ఆధిపత్య ప్రాంతం. డెర్బెంట్ డాగేస్తాన్ రెండవ అతి ముఖ్యమైన నగరం. ఇది కాస్పియన్ సముద్రంలో ఉంది. యూదు సమాజానికి చెందిన పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. డాగేస్తాన్ రాజధాని మఖచ్కలలోని పోలీసు పోస్ట్‌పై కూడా ఉగ్రవాదులు దాడి చేశారు.

డాగేస్తాన్ ప్రావిన్స్ గవర్నర్ ఏమన్నారంటే..
ఈ ఉగ్రదాడి ఘటనపై డాగేస్తాన్ ప్రావిన్స్ గవర్నర్ సెర్గీ మెలికోవ్ (Sergey Melikov) మాట్లాడుతూ.. ఉగ్రవాద దాడుల వెనుక ఎవరున్నారో, ఏ ఉద్దేశ్యంతో ఈ దాడికి పాల్పడ్డారో మాకు తెలుసునని అన్నారు. దాడి చేసిన వారిని గుర్తిస్తున్నామని చెప్పారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. భయాందోళనలకు గురిచేయడానికే ఉగ్రవాదులు ఇక్కడికి వచ్చారు. వారు చేయవలసినదంతా చేసారు. వారి  కోసం అన్వేషణ సాగుతోంది అంటూ ఆయన చెప్పారు. 

Also Read : ఇక నుంచి రాత్రి 10.30 కల్లా షాపులు మూసివేయాల్సిందే!

రష్యా ఉగ్రదాడి ఘటనలు ఈ ట్వీట్ లో చూడొచ్చు.. 

Advertisment
తాజా కథనాలు