Terrorist in up:యూపీలో ఉగ్రదాడి భగ్నం..స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలే టార్గెట్ !

దేశ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను ఈసారి కూడా ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. వేడుకల నేపథ్యంలో దేశంలో అలజడిని రేపాలని స్కెచ్ వేశారు. ఇన్నాళ్ళు సైలంట్ గా ఉన్న స్లీపింగ్ సెల్స్ ఆగష్టు 15 వేడుకల్లో దేశ వ్యాప్తంగా ఎక్కడో ఓ చోట తమ ఉనికి చాటాలని తపించిపోతున్నాయి...

New Update
Terrorist in up:యూపీలో ఉగ్రదాడి భగ్నం..స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలే టార్గెట్ !

Terrorist in up:దేశ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను ఈసారి కూడా ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. వేడుకల నేపథ్యంలో దేశంలో అలజడిని రేపాలని స్కెచ్ వేశారు. ఇన్నాళ్ళు సైలంట్ గా ఉన్న స్లీపింగ్ సెల్స్ ఆగష్టు 15 వేడుకల్లో దేశ వ్యాప్తంగా ఎక్కడో ఓ చోట తమ ఉనికి చాటాలని తపించిపోతున్నాయి. అయితే గత మూడు నెలల నుంచే అలర్ట్ అయిన దేశ నిఘా వ్యవస్థ.. అడుగడుగునా నిఘాను పెంచి ఉగ్రస్థావరాలను కనిపెడుతోంది.

ఇందులో భాగంగా భోపాల్ లో బయటపడ్డ ఉగ్ర మూలాలను పట్టుకొని హైదరాబాద్ తో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో మాటువేసిన ఉగ్రమూకలను పట్టుకొని వాళ్ల కుట్రలను భగ్నం చేసింది. అయితే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఉగ్రదాడి ప్రణాళికను ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ భగ్నం చేసింది.  ఈ నెల 3న అహ్మద్ రజా అనే అనుమానిత టెర్రరిస్ట్ ను అరెస్ట్ చేసింది.అతడ్ని విచారించగా హిజ్బుల్ ముజాహిద్దీన్ తో సంబంధం ఉన్నట్లు తేలింది. అయితే ఆగష్టు 15న ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నట్టు అహ్మద్ విచారణలో తెలిపాడు.

ఇక టెర్రరిస్ట్ అహ్మద్ చెప్పిన ప్రదేశానికి వెళ్లిన ఏటీసీ టీం.. యూఎస్ లో తయారు చేసిన పిస్టల్, కాట్రిడ్జ్ లను స్వాధీనం చేసుకుంది. అంతే కాదు అహ్మద్ కు పాక్ లో ఉన్న చాలా మంద్రి టెర్రరిస్ట్ లతో సంబంధాలున్నాయని కూడా ఏటీసీ బృందం కనిపెట్టింది. మొరాదాబాద్ లోని గుల్దియా పోలీస్ స్టేషన్ కు చెందిన రజా.. ఉగ్రదాడి కోసం కొనుగోలు చేసిన ఆ పిస్టల్ ను గ్రామానికి సమీపంలో దాచి పెట్టినట్టు విచారణలో చెప్పాడు.

దీంతో శుక్రవారం 32 బోర్ మ్యాగజైన్ తో కూడిన ఒక పిస్టల్ తో పాటు మండు గుండు సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే రజా కాశ్మీర్ అనంత నాగ్ కొండల్లో ట్రైనింగ్ తీసుకున్నాడు. వాట్సాప్, ఫేస్ బుక్, మెసెంజర్ చాట్ ల ద్వారా అతడు పాక్, ఆఫ్ఘనిస్తాన్  టెర్రరిస్టులతో టచ్ లో ఉన్నట్లు విచారణలో తేలింది. కాగా, స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకలను టార్గెట్ చేస్తూ.. హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థ తో పాటు హట్ టెర్రర్ సంస్థ దేశంలో విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రణాళికలను రూపొందించాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు