చెన్నైలోని తిరువళ్లూరు జిల్లా కాకలూరు పారిశ్రామిక వాడలో ప్రైవేట్ పెయింట్ ఫ్యాక్టరీ లో షాట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెయింట్ ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన రసాయనాలతో భారీ పేలుడు సంభవించింది. ఈ అగ్నిమాపక కర్మాగారంలో పనిచేస్తున్నముగ్గురు వ్యక్తులు సజీవదహనమైయారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మరి కొందరు శిథిలాల మధ్య చిక్కుకుని ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదంపై పెయింట్ ఫ్యాక్టరీ యజమాని పై పోలీసులు కేసు నమోదు చేశారు.