Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద మళ్లీ హైటెన్షన్.. ఢీ అంటే ఢీ అంటున్న తెలంగాణ,ఏపీ పోలీసులు..

నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద తెలంగాణ, ఏపీ పోలీసుల మధ్య రెండో రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 13వ గేటు నుంచి 26వరకు ఏపీ పోలీసులు ముళ్లకంచెలు వేశారు. ప్రస్తుతం డ్యామ్‌కు ఇరువైపుల వందలాది మంది తెలంగాణ, ఏపీ పోలీసుల బందోబస్తు ఉంది.

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద మళ్లీ హైటెన్షన్.. ఢీ అంటే ఢీ అంటున్న తెలంగాణ,ఏపీ పోలీసులు..
New Update

Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర యుద్ధ వాతావారణం కొనసాగుతోంది. రెండో రోజు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ, ఏపీ పోలీసులు ఢీ అంటే ఢీ అంటున్నారు. 13వ గేటు నుంచి 26వరకు ఏపీ పోలీసులు ముళ్లకంచెలు వేశారు. ప్రస్తుతం డ్యామ్‌కు ఇరువైపుల వందలాది మంది తెలంగాణ, ఏపీ పోలీసుల బందోబస్తు ఉంది. పోలీసుల మోహరింపుతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిలాఉండగా.. ప్రాజెక్టు 26 గేట్లలో సగ భాగమైన 13వ గేట్‌ వరకు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు సుమారు 500 మంది పోలీసుతో బుధవారం అర్ధరాత్రి సాగర్‌ ప్రాజెక్టు వద్దకు వచ్చారు. అడ్డుకున్న డ్యామ్‌ ఎస్పీఎఫ్‌ సిబ్బందిపై దాడి చేసి మొబైల్‌ ఫోన్లు, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత 13వ గేట్‌ వద్దకు చేరుకొని ముళ్ల కంచెను ఏర్పాటు చేసి డ్యామ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో తెలంగాణ, ఏపీ పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు తాజాగా మళ్లీ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది.

Also Read: కూతురు కనిపించడం లేదని ఫిర్యాదుకు వస్తే.. కామవాంఛ తీర్చమన్న పోలీస్..

#nagarjuna-sagar-dam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి