MS Dhoni: ధోని అభిమానులకు త్వరలో బ్యాడ్ న్యూస్ వినక తప్పదా!

ఐపీఎల్‌కి ప్రారంభంకు ముందు ధోని వీడ్కోలు పలుకుతాడని ఫ్యాన్స్ ఆందోళన చెందారు.. కానీ వీటన్నింటినీ చెరిపేస్తూ 42 ఏళ్ల వయసులో ధోని ధనాధన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అయితే ఈ సారి సంకేతాలు మరోలా ఉన్నాయి. ఇదే ధోని లాస్ట్‌ ఐపీఎల్‌ సీజన్‌ అవుతుందా?లేదా మరో సీజన్ ఆడతాడా?

MS Dhoni: ధోని అభిమానులకు త్వరలో బ్యాడ్ న్యూస్ వినక తప్పదా!
New Update

క్రికెట్‌ ప్రపంచంలో ఎంఎస్‌ ధోనీకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)కి భారీ సంఖ్యలో ఫ్యాన్స్‌ ఉండటానికి ప్రధాన కారణం ధోని అని చెప్పవచ్చు. ఫేవరెట్‌ కెప్టెన్‌, ఫేవరెట్‌ వికెట్‌ కీపర్‌, ఫేవరెట్‌ ప్లేయర్‌ ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఎక్కువ మంది చెప్పే ఒకే సమాధానం ఎంఎస్‌ ధోని. ఈ లెజెండరీ ప్లేయర్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కి చాలా కాలం క్రితమే గుడ్‌బై చెప్పేశాడు.IPL 2024 ప్రారంభానికి ఒక రోజు ముందు ధోని సీఎస్కే కెప్టెన్సీని వదులుకున్నాడు. యంగ్‌ ప్లేయర్‌ రుతురాజ్ గైక్వాడ్‌కి జట్టు పగ్గాలు అప్పగించాడు. వాస్తవానికి CSK కెప్టెన్సీ నుంచి ధోని వైదొలగడం ఇదే మొదటిసారి కాదు. 2022లో రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా నియమించారు. ఆ తర్వాత ధోనినే తిరిగి కొనసాగాడు. కానీ ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం రుతురాజ్‌కి 27 ఏళ్లు మాత్రమే, అతని దీర్ఘకాలిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయం ఆకస్మికంగా తీసుకున్నది కాదు, ధోని వారసుడి గురించి గత సీజన్‌ నుంచి చర్చలు జరిగినట్లు రుతురాజ్‌ వెల్లడించాడు.

గతేడాది ఐపీఎల్ తర్వాత ధోని మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ సంవత్సరం మ్యాచ్‌లకు అందుబాటులో ఉన్నా, మోకాలి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. ఎడమ మోకాలికి బ్లాక్‌ బ్యాండ్‌ను చుట్టుకుని కనిపిస్తున్నాడు. ఏప్రిల్‌ 14న ఆదివారం ముంబైతో ఆడిన మ్యాచ్‌లో ధోని తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది.మరింత కాలం ధోని క్రికెట్‌లో కొనసాగడం కష్టమనే అనిపిస్తోంది. ముంబైపై 4 బంతుల్లో 20 పరుగులు చేసినా, అద్భుతంగా కీపింగ్‌ చేసినా, తలాకి ఫిట్‌నెస్‌ చాలా కీలకం. లేటెస్ట్‌గా బస్సు దిగే సమయంలో ధోనికి రైనా సహకరించిన ఫోటోలు కూడా వైరలవుతున్నాయి.

సీఎస్కే ఫ్యాన్స్‌ కోసం ఈ సీజన్‌లో ధోని ఎక్కువ బ్యాటింగ్‌ చేస్తున్నట్లు కనిపిస్తోంది. గత కొన్ని సీజన్‌లతో పోలిస్తే ఐపీఎల్‌ 2024లో ఎక్కువ డెలివరీలు ఫేస్‌ చేశాడు. 2021లో 16 మ్యాచ్‌ల్లో 107 బంతులు ఎదుర్కొన్నాడు, 2023లో 16 మ్యాచ్‌లలో 57, ఈ ఏడాది 6 మ్యాచ్‌ల్లో 25 బాల్స్‌ ఆడాడు. చెన్నై ఫ్యాన్స్‌ హ్యాపీనెస్‌ కోసం ధోనీ అవకాశం ఉన్నప్పుడు క్రీజులోకి వస్తున్నట్లు అర్థమవుతోంది. వాస్తవానికి, ధోని ఈ ఏడాది ప్రతి బంతిని బౌండరీ దాటించాలన్నట్లే ఆడుతున్నాడు.

అన్రిచ్ నోకియా, హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో బాదిన వరుస బౌండరీలకు స్టేడియం ఫ్యాన్స్‌ అరుపులతో మార్మోగిపోయింది.కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో దాదాపు విజయం ఖాయమైన తరుణంలో ధోనీ ఓ ట్రిక్ ప్లే చేశాడు. ముందు జడేజాను బ్యాటింగ్‌కి వెళ్లమని అడిగాడు, అతను మైదానంలోకి అడుగుపెట్టే ముందు, ధోని అతన్ని క్రాస్‌ చేశాడు. ధోని గ్రౌండ్‌లో అడుగుపెట్టగానే ఫ్యాన్స్‌ కేకలతో స్టేడియం హోరెత్తింది.వాస్తవానికి, తలా ధోని ఏమాలోచిస్తున్నాడో ఎవరికీ తెలియదు. అతను మరో సీజన్‌ ఆడాలని కూడా కోరుకోవచ్చు. కానీ ప్రతి విజయవంతమైన ప్రయాణానికి ఓ ముగింపు ఉంటుంది. ధోనీకి ఇదే చివరి సీజన్‌ అని చాలా సంకేతాలు చెబుతున్నాయి. కానీ ఏం జరుగుతుందో తెలియాలంటే ధోని తన నిర్ణయం ప్రకటించే వరకు వేచి చూడక తప్పదు.

#ms-dhoni #ipl-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe